Shabbir Ali on KCR Family about Phone Tapping : ఫోన్ ట్యాపింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకెళ్లడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జోస్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఏడాది ముందే రేవంత్‌రెడ్డి చెప్పారని వెల్లడించారు. తాను, తన సతీమణి మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారని ఆరోపించారు. కొందరి బీఆర్ఎస్ మాజీ మంత్రుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. ఇవాళ కామారెడ్జిలో జరిగిన విలేకరుల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Shabbir Ali about BB Patil : పదేళ్లుగా జహీరాబాద్‌కు బీబీ పాటిల్ చేసిందేమీ లేదని, అభివృద్ధి పనులు అసలే చేయలేదని షబ్బీర్ అలీ విమర్శించారు. రెండు సార్లు గెలిచినప్పటికీ కనీసం మండలాల పేర్లు సైతం తెలియవని ఎద్దేవా చేశారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాలుగు నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పూర్తి చేశామని, ఈ ఏడాదిలోపు హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.
'నేను నా భార్య మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు. బీఆర్ఎస్ మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాళ్ల సతీమణిలతో మాట్లాడుకున్నది విన్నారు. కేసీఆర్ చుట్టాలు మాట్లాడుకునేది కూడా ట్యాపింగ్ చేశారు. ఇది చాలా పెద్ద నేరం. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు, ఆ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తారని నా నమ్మకం, విశ్వాసం. ప్రభుత్వ సలహాదారుగా నాకున్న సమాచారం ప్రకారం త్వరలో వీళ్లందరూ జైలుకు వెళ్తారు.'- షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారుడు
Shabbir Ali hot comments on KTR : ఇదికాగా మరోవైపు ఈ నెల 13న జరిగిన మీడియా సమావేశంలో కూడా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాట్‌కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్(KTR) జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన కవిత లిక్కర్ స్కామ్‌తో పాటు, ఇతర అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్(Phone tapping) చేసి భార్యాభర్తల సంభాషణలు వినడం సిగ్గు చేటన్నారు.
ఏకంగా తాము ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమేనని, పోలీసు అధికారులే అంగీకరించారని షబ్బీర్ అలీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుందని, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వాహనాల్లో నగదు రవాణా చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు ఒప్పుకున్నారన్నారు.
కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం - షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ - Shabbir Ali hot comments