Inquiry On District Medical And Health Officer : మహిళా వైద్యులపై డీఎంహెచ్ఓ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విచారణ చేపట్టింది. తమపై కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ 20 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర వైద్యశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు పది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల అంశంపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో మహిళా మెడికల్ అధికారులు, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారి ముందు తమ గోడును విన్నవించుకున్నారు. సుదీర్ఘంగా విచారణ చేపట్టిన అమర్ సింగ్ నాయక్ విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళా మెడికల్ ఆఫీసర్లకు మద్దతుగా కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి విచారణ చేపడుతున్న కార్యాలయానికి వచ్చారు.
ఇదీ జరిగింది : విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 8వ తేదీన జరిగిన సమావేశంలో మహిళా వైద్యాధికారులతో డీహెచ్ఎంఓ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళా వైద్యాధికారులు జిల్లా కలెక్టర్‌తో పాటు, వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళా వైద్యులు ఇచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర వైద్యశాఖ దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదిక అందజేయాలని రాష్ట్ర వైద్యాధికారిని ఆదేశించింది. ఒక బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సరైనది కాదని మహిళా వైద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని విచారణాధికారిని కోరారు.
విద్యార్థినిపై లైంగిక వేధింపులు : కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో జరిగింది. తార్నాకలో ఇఫ్లూలో పీజీ విద్యార్థినిపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారయత్నం చేయబోయారు. ఈ ఘటనపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతుందని ఇఫ్లూ విద్యార్థులు కొద్ది రోజుల క్రితం ఆందోళనకు దిగారు.
ఉద్యోగినిపై మనసు పారేసుకున్న కంపెనీ సీఈవో - అమెరికా నుంచి ఇండియాకు వచ్చి మరీ వేధింపులు