Road Accident In YSR Dist In AP : వైఎస్సార్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలో కారును కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురితో పాటు కంటైనర్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. కారులోని వ్యక్తులు బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల స్వస్థలం చక్రాయపేట మండలం కొన్నేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరో ప్రమాదంలో ఇద్దరు మృతి: దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. కర్నూలు నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
టూరిస్ట్ల బస్సుకు ప్రమాదం- 11మంది దుర్మరణం- మరోఘటనలో 26మంది బలి!
ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు - Road Accident In Hyderabad