ETV Bharat / state

మియాపూర్​లో విషాదం - లిఫ్ట్ కేబుల్​ తెగిపడి ఒకరి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు - Miyapur Lift Fell Down Death - MIYAPUR LIFT FELL DOWN DEATH

Miyapur Lift Fell Down Death : నిర్మాణంలో ఉన్న భవనంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కేబుల్‌ తెగి పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్​లోని మియాపూర్​లో చోటుచేసుకుంది.

Miyapur Lift Collapse Issue Today
Miyapur Lift Fell Down Death (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 3:52 PM IST

Miyapur Lift Collapse Issue Today : హైదరాబాద్ నగరంలోని మియాపూర్​లో విషాదం నెలకొంది. స్థానిక హఫీజ్‌పేటలో నిర్మాణంలో ఉన్న ఆదిత్య ఫార్చూన్‌ హైట్స్‌ - బహుళ అంతస్థుల భవనం లిఫ్ట్‌ కేబుల్‌ తెగిపడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. హఫీజ్‌పేటలో అదిత్య ఫార్చూన్‌ పేరుతో ఆదిత్య సంస్థ బహుళ అంతస్థుల నిర్మాణాలను చేపట్టింది. నిర్మాణంలో భాగంగా భవనాలకు తాత్కాలిక లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.

సోమవారం ఉదయం కొందరు ఉద్యోగులతో పాటు మరికొందరు కార్మికులు లిఫ్ట్‌లో వెళ్తుండగా కేబుల్ తీగ తెగడంతో అది ఒక్కసారిగా కింద పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు గాయపడగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటన జరిగిన బహుళ అంతస్థులోనికి ఎవరినీ అనుమతించడం లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.