ETV Bharat / state

సికింద్రాబాద్‌ - శాలీమార్‌ ఎక్స్‌ప్రెస్​కు ప్రమాదం - పట్టాలు తప్పిన 3 బోగీలు

పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌-శాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌ - పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్‌ స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకున్న ఘటన - ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపిన అధికారులు

Secundrabad Shalimar SF Express
Secundrabad Shalimar SF Express Train Derailed (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 10:20 AM IST

Updated : Nov 9, 2024, 11:34 AM IST

Secundrabad Shalimar SF Express Train Derailed : సికింద్రాబాద్- శాలీమార్ ఎక్స్​ప్రెస్ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని నల్పూర్‌ స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. జరిగిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్​వో వెల్లడించారు. పట్టాలు తప్పిన వాటిల్లో రెండు ప్రయాణికుల బోగీలు కాగా ఒకటి పార్సిల్ వ్యాన్ అని అధికారులు తెలిపారు.

మహబూబాబాద్‌ జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు : మరోవైపు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ జంక్షన్‌ బ్రాంచి లైనులో గూడ్స్‌ రైలుకు చెందిన మూడు వ్యాగన్లు శుక్రవారం రాత్రి పట్టాలు తప్పాయి. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్‌(కొత్తగూడెం)కు ఈ గూడ్స్‌ 59 ఖాళీ వ్యాగన్లతో వెళ్తుంది. ఈ రైలు డోర్నకల్​ బ్రాంచి లైనులోకి ప్రవేశించగానే ఇంజిన్‌ వెనకాల 17,18,19 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్రాంచి లైనులో ఈ సంఘటన చోటుచేసుకున్నందున రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. విషయం తెలియగానే వివిధ విభాగాల అధికారులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రత్యామ్నాయ ఇంజిన్లు అమర్చి ముందున్న వ్యాగన్లను పోచారం వైపునకు, వెనకాలున్న వ్యాగన్లను పాపటపల్లి వైపునకు తీసుకెళ్లారు. పట్టాలు తప్పిన వ్యాగన్ల పునరుద్ధరణ రాత్రి 10 గంటల సమయంలో మొదలైంది. ప్రమాదానికి గల కారణం విచారణలోనే తెలుస్తుందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Last Updated : Nov 9, 2024, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.