ETV Bharat / state

పారేసే ప్లాస్టిక్​తో రైల్వేకు కాసుల వర్షం - కిలో చెత్తకు ఎంత ఆదాయం వస్తుందంటే? - ScrapQ Agreement with SCR - SCRAPQ AGREEMENT WITH SCR

ScrapQ Agreement with SCR : దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో భారీ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రైళ్లు, స్టేషన్లలో ప్రయాణికులతో పాటు వారి ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా అంతే మొత్తంలో పోగవుతుంటాయి. గతంలో ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు దక్షిణ మధ్య రైల్వే భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ ప్లాస్టిక్ వ్యర్థాలే రైల్వేకు కాసులు కురిపిస్తున్నాయి. ఇంతకీ పారవేసే ప్లాస్టిక్​తో రైల్వేకు ఆదాయం ఎలా సమకూరుతుంది? ప్లాస్టిక్​ను తీసుకెళ్లే వారు రైల్వేకు ఎంత చెల్లిస్తారు? తదితర అంశాలపై ప్రత్యేక కథనం.

Disposal of Plastic Waste in SCR
ScrapQ Agreement with SCR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 7:11 PM IST

Disposal of Plastic Waste in SCR : దక్షిణ మధ్య రైల్వేకు పారవేసే ప్లాస్టిక్ కాసుల వర్షం కురిపిస్తోంది. పారేసే చెత్త ప్లాస్టిక్​కు డబ్బులు ఎవరు ఇస్తారులే అనుకుంటున్నారేమో! డబ్బులు చెల్లించి మరీ, ఓ సంస్థ ప్లాస్టిక్​ను కొనుగోలు చేస్తోంది. రైల్వే ప్రయాణికులు వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు రైల్వే అధికారులతో స్క్రాప్ క్యూ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్టణం, శంబల్​పూర్ రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ఈవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ సంస్థ సేకరిస్తోంది.

మూడేళ్లపాటు ఒప్పందం : తాజాగా మరో మూడు రైల్వే స్టేషన్లలో సైతం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఇటీవలే సదరు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కాచిగూడ, నిజామాబాద్, కర్నూల్ రైల్వే స్టేషన్లలో రైళ్లలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను మూడేళ్ల పాటు సేకరించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా స్క్రాప్ క్యూ సంస్థ ప్రతినిధులు, ప్రతి నిత్యం రైళ్లలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి వాటిని తీసుకెళుతుంటారు.

ప్లాస్టిక్ డేటా సేకరణ : స్క్రాప్ క్యూ సంస్థ ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థను కలిగి ఉంది. ఒక రైలులో ఒక ప్రయాణికుడు ఏమేరకు ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తారు. ఒక్కో రైలులో ఎంత మేరకు ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. తదితర వాటిని ఈ వ్యవస్థతో కచ్చితంగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రతి ప్రయాణికుడు ప్రయాణించే రైలులో కనీసం 40 గ్రాముల నుంచి 50 గ్రాముల ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్​ను పడేస్తారని ట్రాక్ అండ్ ట్రేస్​తో తెలుసకున్నట్లు స్క్రాప్ క్యూ సంస్థ వెల్లడించింది.

నిజామాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజూ సుమారు 10వేల మంది ప్రయాణికులు, కర్నూలు స్టేషన్ నుంచి సుమారు 10వేల మంది ప్రయాణికులు, కాచిగూడ స్టేషన్ నుంచి రోజుకు 20 వేల మంది ప్రయాణికులు, విశాఖపట్టణం నుంచి సుమారు 20వేల మంది ప్రయాణికులు శంబల్​పూర్ నుంచి సుమారు 5వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సంస్థ అంచనావేస్తోంది. ప్రతి కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు స్క్రాప్ క్యూ సంస్థ రూ.1.50 పైసలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

స్క్రాప్ క్యూ సంస్థ ఏడేళ్లుగా సేవలు అందిస్తోంది. రైల్వేశాఖ నుంచి 2022 డిసెంబర్​లో రీసైకిల్స్​ను తీసుకోవడం ప్రారంభించింది. కేవలం రైల్వే శాఖ నుంచి మాత్రమే కాదు, గృహాలు, ఆసుపత్రులు, వ్యాపార సముదాయల నుంచి కూడా ప్లాస్టిక్​ను సేకరించి అందుకు తగ్గట్లు డబ్బులు చెల్లిస్తారు. నిజామాబాద్ స్టేషన్​కు మూడేళ్లకు 6 లక్షల రూపాయలు, కర్నూలు స్టేషన్​కు 6 లక్షల రూపాయలు, విశాఖపట్టణం స్టేషన్​కు 12.5 లక్షల రూపాయలు, శంబల్​పూర్ 2.1 లక్షల రూపాయలు, కాచిగూడ స్టేషన్​కు 9 లక్షల రూపాయలను స్క్రాప్ క్యూ సంస్థ చెల్లించనుంది.

ఇంటర్వ్యూ లేకుండానే రైల్వే జాబ్స్ - డిగ్రీ ఉంటే చాలు - నెలకు రూ.65 వేల శాలరీ - RRB NTPC Recruitment 2024

ఇంటర్​ అర్హతతో - రైల్వేలో 3,445 క్లర్క్​ & టైపిస్ట్​ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.