ETV Bharat / state

తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం - మీ పిల్లలకు స్టేషనరీ కొనాలంటే ఈ షాప్స్ బెస్ట్ ఛాయిస్ - TELANGANA SCHOOLS REOPENED TODAY

Schools Reopened In Telangana 2024 : తెలంగాణలో బడి గంట మోగింది. పిల్లలంతా వేసవి సెలవులకు టాటా చెప్పి ఇక బడి బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు 48 రోజుల అనంతరం స్కూళ్లకు వెళ్లారు.

Schools Reopen in Telangana
Schools Reopen in Telangana 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 9:04 AM IST

Schools Reopen in Telangana 2024 : బుధవారం నుంచి పాఠశాలలు మొదలుకానున్న నేపథ్యలం హైదరాబాద్​లోని సికింద్రాబాద్​, కోఠి, బేగంబజార్​ మార్కెట్లలో రద్దీ నెలకొంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంతో విద్యార్థులకు కావాల్సిన వాటి కోసం ఈ మార్కెట్ల బాట పడుతుంటారు. పుస్తక దుకాణాలతో పాటు స్టేషనరీ, బ్యాగులు, బూట్లు, దుస్తుల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి నగర వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్​కు వస్తుంటారు.

వేసవి సెలవులు ముగుస్తుండడంతో పాఠశాల యాజమాన్యం పిల్లలకు కావాల్సివ పాఠ్య పుస్తకాలు, నోట్​ బుక్స్​ పూర్తి లిస్ట్​ ఇస్తుంటారు. వీటితో పాటు పిల్లలకు కావాల్సిన స్టేషనరీ, స్కూల్​ బ్యాగులు, బూట్లు, మంచినీటి సీసాలు, లంచ్​ బాక్సులు, యూనిఫామ్​ మొదలగు వస్తువులను కొనేందుకు వచ్చిన కొనుగోలుదారులతో సోమవారం ఈ ప్రధాన కూడళ్లు కిటకిటలాడాయి. కాగా ఒక్కో మార్కెట్​లో కొన్ని వస్తువులకు ఫేమస్​, మరి ఏది ఎక్కడ తీసుకుంటే బెటరో తెలుసుకుందాం.

ఏ పుస్తకమైన దొరుకుతుంది ​ : కోఠి మార్కెట్​ అనగానే చాలామందికి బట్టలు, పుస్తకాల షాపింగ్ గుర్తొస్తుంటుంది. ముఖ్యంగా ఇక్కడ పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షల బుక్స్ లభిస్తాయి. మరొక్క విషయం ఏంటి అంటే ఇక్కడ పాత పుస్తకాలు దొరుకుతాయి. వాటిని సగం ధరకు అమ్ముతారు. అందుకే ఇక్కడ పుస్తకాలు కొనడానికి మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా వస్తుంటారు. నోట్​ బుక్స్​ విషయానికి వస్తే నాణ్యత, పేజీల సంఖ్యను బట్టి ఇక్కడ పుస్తకాల ధరలు ఉంటాయి. నోట్​ బుక్ ఒక్కొక్కటి చొప్పున కాకుండా వాటిని కేజీల వారిగా అమ్ముతారు. అందుకే ఇక్కడ పుస్తకాలు కొనడానికి అధిక సంఖ్యలో పస్తుంటారు. స్కూల్​ ప్రాంరంభమవుతే ఈ మార్కెట్​ అంతా జనంతో నిండిపోతుంది. ​

మోయలేని భారంగా మారిన ప్రైవేట్ చదువులు - ఫీజుల నియంత్రణ ఎలా ? - Private Schools Fee Increased in Telangana

సామాన్యులకు అందుబాటు ధరల్లో : సికింద్రాబాద్​ అంటే బట్టల షాపింగ్​ అంటారు అందరూ. పాఠశాలలు ప్రారంభం అవుతే మాత్రం చాలామంది స్కూల్​ యూనిఫామ్స్​ ఇక్కడే కొంటారు. కారణం సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉంటాయి. సికింద్రాబాద్​ మార్కెట్లో కూడా పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు ఉంటాయి. కానీ ఇక్కడు యూనిఫామ్​, బూట్లు, బాటిళ్లు, బాక్సులు కొనడానికి ప్రాధాన్యత ఇస్తారు. పాఠశాల పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో మార్కెట్లో విక్రయాలు జోరందుకున్నాయి.

హోల్​సేల్​ రేట్​ : బేగం బజార్​లో స్టేషనరీ వస్తువులు బాగా ఫేమస్​. వివిధ రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. పిల్లలు చేసే ప్రాజెక్టులకు, చార్ట్​ వంటి అవసరమయ్యే ప్రతిది ఇక్కడ లభిస్తాయి. అందులోనూ హోల్​సేల్​ రేట్​కి దొరుకుతాయి. అందుకే ఇక్కడ వాటిని కొనడానికి ఇష్టపడాతారు. అలాగే బ్యాగులు, బాటిల్స్​, బాక్సులు అన్ని ఇక్కడ ఉంటాయి. సామాన్యులను అనుకువగా ఉన్న ధరల్లో దొరుకుతాయి కాబట్టి స్కూల్స్ మొదలవగానే ఇక్కడి మార్కెట్లు కిక్కరిసిపోతాయి. ఇవే కాకుండా హైదరాబాద్​లో సుల్తాన్‌బజార్, జైన్‌ మందిర్‌ లేన్, బడీచౌడి, కామత్‌ హోటల్‌ లేన్‌ ప్రాంతాల్లోని ఫుట్‌వేర్‌ దుకాణాలు, రెడీమేడ్‌ వస్త్ర దుకాణాల వద్ద సందడి ఉంటుంది.

2024-25 అకడమిక్​ క్యాలెండర్ విడుదల - పాఠశాలలకు దసరా, సంక్రాంతి సెలవులు ఇవే

Schools Reopen: రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.