SC on MLC Kavitha Petition : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులను అరెస్టు చేసింది. మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ ఇప్పటికే పలుమార్లు విచారించింది. అయితే మరోసారి విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో కవిత గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
MLC Kavitha Delhi Liquor Policy : మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తనపై ఎలాంటి బలవంతపు చర్యలకు ఈడీ పాల్పడకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై గత కొద్ది నెలలుగా సుప్రీం కోర్టు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కవిత వ్యాజ్యంపై విచారణ చేపట్టింది.
దిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ
సమన్లు జారీ చేయమని చెప్పారుగా : ఈ సందర్భంగా రెండు వేర్వేరు కేసుల్లో గత ఉత్తర్వులను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత విచారణ సందర్భంగా నళిని చిదంబరం కేసుతో జతపరిచిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరిపింది. కవిత సమన్లు తీసుకోవట్లేదని, విచారణకు రావట్లేదన్న ఈడీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ సమన్లు జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని తెలిపారు.
16కు విచారణ వాయిదా : సమన్లు జారీ చేయబోమనేది ఒక్కసారికే కానీ, ప్రతిసారి కాదని ఈడీ న్యాయవాది చెప్పారు. ఈ క్రమంలో ఈ వ్యాజ్యంపై తుది విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 16వ తేదీన జరగనున్న విచారణలో అన్ని విషయాలు పరిశీలిస్తామని, రికార్డును ముందుగా తాము పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు- 21న విచారణకు హాజరు కావాలని సూచన
'అరెస్ట్ చేసేందుకే ఈడీ నోటీసులు'- లిక్కర్ కేసులో విచారణకు మూడోసారీ కేజ్రీ గైర్హాజరు