Sarcasm on Social Media Over the Attack on YS Jagan: జగన్ సన్నిహితుడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనం జరిగే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో రాష్ట్రంలో ఓ సంచలన సంఘటన జరగబోతోందని అది ఎన్నికల మూడ్‌నే మార్చేస్తుందంటూ ఉంది. ఆ పోస్ట్‌ను బట్టి ఈ ఎన్నికలకు ఎవరిని గొడ్డలిపోటుకు గురి చేస్తారో అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ డైరక్షన్లో భాగంగా ఆడిన నాటకంలో కొత్తగా కోడికత్తి 2.0.కు తెరలేపారనే సామజిక మాద్యమాల్లో విమర్శలు వస్తున్నాయి.
గులకరాయి నాటకాలు: గతానుభవాల దృష్ట్యా జనం ఇక జగన్ నాటకాలు నమ్మే స్థితిలో లేరని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎన్నికలకు ఖచ్చితంగా 30 రోజుల ముందు ఇటువంటి సానుభూతి డ్రామాలు ఆడటం కొత్తకాదని విమర్శిస్తున్నారు. గొడ్డలివేటు, కోడికత్తి నాటకాలు అయిపోయి ఇప్పుడు గులకరాయి దాడి డ్రామాకు జగన్ తెరలేపారని ఎద్దేవా చేస్తున్నారు.
గురి చూసి మిస్ కాకుండా: వేలాదిమంది పోలీసుల భద్రత మధ్య దాడి జరగడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాళ్ల దాడిలో రాయి దెబ్బ తగలడం కామన్ కానీ చూట్టూ వందల మంది జనం ఉన్నారు. అంత జనంలో కూడా కరెక్టుగా జగన్ నుదిటి మీద ఎలా కొట్టారు అని సందేహిస్తున్నారు. అదేదో స్టంప్‌ల మీదకి బాల్ విసిరినట్టు గురి చూసి మిస్ కాకుండా కరెక్ట్‌గా నుదిటి మీద తగిలేట్టు విసరడం అంటే అనుమానించాల్సిదేనని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ జగన్నాటకం సినిమాలోనే సాధ్యం అవుతుంది అని అంటున్నారు.
పక్కా పథకం ప్రకారమే: నిజంగా దాడి జరిగి ఉంటే సంబంధిత భవనాన్ని చుట్టుముట్టి నిందితుడుని పట్టుకోవడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసు వ్యవస్థ ఉంది, ఇంటలిజెన్స్ వారు ఉన్నారు. పైగా జగన్ అభిమానులు చూట్టూ వందల సంఖ్యలో ఉన్నారు. జగన్‌ను ఒక్క మాట అంటే ఎగబడి కొట్టే వారు జగన్ మీద దాడి జరిగినా ఆ నిందితుడిని పట్టుకోలేదంటే కచ్చితంగా ఇది ఎన్నికల కోసం జగన్ ఆడే నాటకమే అని అనుకుంటున్నారు. పక్కా పథకం ప్రకారమే 2.0 వెర్షన్లో జరిగిన సానుభూతి నాటకమే ఈ గులకరాయి దాడి అని విమర్శిస్తున్నారు.
జూన్ 4న అమరావతి రక్షణ - జగనాసుర వధ : చంద్రబాబు - Chandrababu Election Campaign
సీఎంని కొట్టడం ఆషామాషీ కాదు: గులకరాయి దాడి ఘటన జరిగిన 4వ నిమిషానికే క్యాట్ బాల్ ఉపయోగించారని జగన్ మీడియాకు ఎలా తెలిసిందని అంటున్నారు. వాళ్లే చేయించుకున్న కుట్ర కాబట్టే నిందితుడిపై దృష్టి సారించలేదనుకుంటా అని చర్చించుకుంటున్నారు. క్యాట్ బాల్‌తో సరిగ్గా కనుబొమ్మపై తగిలేలా కొట్టేంత ఏకలవ్యులు జగన్ జమానాలో ఉన్నారేమో కానీ, వందలాది మంది పోలీసుల మధ్య ఉన్న ముఖ్యమంత్రిని కొట్టడం ఆషామాషీ కాదని అంటున్నారు.
కరెంట్ ఎందుకు పోయింది: సీఎం పర్యటన ఉందని తెలిసినా సరిగ్గా అదే సమయంలో కరెంట్ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నిస్తున్నారు. ఇది ముందుగా అనుకున్న పథకంలో భాగమేమో అని ఎద్దేవా చేస్తున్నారు. గొడ్డలి పోటు, కోడి కత్తి అయ్యిపోయి ఇప్పుడు క్యాట్ బాల్ డ్రామా మొదలుపెట్టారని విమర్శిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత అర్థమైపోవడం వల్లే ఈ సానుభూతి నాటకమని మండిపడుతున్నారు. అసలు దీని వెనుక మర్మమేంటి అనేది సీబీఐ తేల్చాలంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు.