Dancers Team Gets International Wonder Book Record : శాస్త్రీయ సంగీతం చెవులను మీటుతుంటే కూచిపూడి నృత్యం ఒక్కరు చేసినా చూపు తిప్పుకోలేం. అలాంటిది ఏకంగా 131 మంది చిన్నారులు ఒకేవేదికపై లయబద్ధంగా కాలు కదిపితే నాట్య అభిమానులకు పండగలానే ఉంటుంది. సంగారెడ్డిలోని నటరాజ స్ఫూర్తి అకాడమీ తరపున నాట్యగురువు జ్యోతి కులకుర్ణి ఆధ్వర్యంలో ఈ అద్భుతం సాక్షాత్కరించింది. 'పలుకే బంగారమాయేనా' అంటూ రామదాసు కీర్తనకు కాలు కదిపితే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు వచ్చి చేరింది. ప్రతిభ ఎక్కడ ఉన్నా గుర్తించి పురస్కారం అందిస్తామంటున్నారు వండర్ బుక్ ఇండియా చీఫ్ కో ఆర్డినేటర్ నరేంద్ర.
25 ఏళ్లుగా కూచిపూడి నృత్యాన్ని నాట్యగురువు జ్యోతి కులకర్ణి చిన్నారులకు నేర్పిస్తున్నారు. తమ అకాడమీలో చేరిన విద్యార్థి తప్పని సరిగా జీవితంలో మంచి స్థాయికి ఎదుతారని ఆమె చెబుతున్నారు. ఇప్పటికే గిన్నీస్ రికార్డ్‌తో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా వండర్ బుక్ అవార్డు రావడంపై నాట్య గురువు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
"జ్యోతి కులకర్ణి శిష్యులతో పలుకే బంగారమాయేనా అనే 9నిమిషాల 5సెకన్ల పాటపై 131మంది చిన్నారులు నృత్యం చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వారిపేరు నమోదు చేసుకున్నారు. ఎవరైనా అద్భుతాలు, అద్వీతీయంగా చేసిన వారికి ఇంటర్నేషల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కుతుంది." - బింగి నరేంద్ర గౌడ్, ఇండియా ఛీప్ కో-ఆర్డినేటర్ ఇంటర్ నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్
అంతరించిపోతున్న కూచిపూడి కళకు పునర్వైభవం తీసుకురావాలని విద్యార్థులు కృషి చేస్తున్నారు. తమ ఖాతాలోకి మరో అంతర్జాతీయ పురస్కారం రావడంతో గురువుకు ఎంతో రుణపడి ఉన్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఎంచుకున్నా బాటను మనసా, వాచా ఆచరిస్తే విజయాలు వాటంతట అవే వరిస్తాయనేందుకు ఈ చిన్నారులే నిదర్శనంగా నిలుస్తున్నారు.
"నా శిష్యులు చాలా కష్టపడతారు. ఈరోజు రావాల్సిందే అంటే తప్పక వస్తారు. దీనికోసం గత వారం రోజులుగా కష్టపడుతున్నారు. వాళ్లు కృషి వల్లనే నాకు ఈరోజు ఈ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. గత 25సంవత్సరాల నుంచి నేను శిక్షణ ఇస్తూ కార్యక్రమాలు చేస్తున్నాను. గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ కూడా సాధించాము. గత పాతిక సంవత్సరాల నుంచి జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు చాలా చేస్తున్నాం." - జ్యోతి కులకర్ణి, నాట్య గురువు
ఫస్ట్ క్లాస్ నృత్యం - ఒకటో తరగతిలోనే 22 అవార్డులు సాధించిన అర్చన