Sanath Nagar Fire Station Inaugurated by CM Revanth Reddy : హైదరాబాద్‌లో అగ్నిమాపక శాఖ నూతన ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ కేంద్రంతో పాటు సనత్‌నగర్ అగ్నిమాపక ఆఫీస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం లక్డీకాపూల్ అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలోని నానక్రాంగూడాలో అగ్నిమాపక విభాగం ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు.
కొత్త భవనంలో అగ్నిమాపక శాఖకు తొలిసారిగా అన్ని వసతులతో కూడిన కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఒకే చోట అగ్నిమాపక శాఖ రాష్ట్ర కార్యాలయం, కమాండ్ కంట్రోల్‌తో పాటు అగ్నిమాపక కేంద్రం ఉంటుంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ కలిపి మొత్తం ఆరు అంతస్తుల్లో కార్యాలయం నిర్మించారు. దాదాపు రూ.17 కోట్లతో భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అత్యాధునిక వసతులు, సాంకేతిక హంగులతో అగ్నిమాపక ప్రధాన కార్యాలయం అందుబాటులోకి రానుంది.
అగ్నిమాపక శాఖ వార్షిక నివేదిక విడుదల - ఈ సంవత్సరం ఎంతమందిని కాపాడారంటే?
Fire Command Control : 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే అత్యాధునిక పబ్లిక్ సేఫ్టీ ఆన్సరింగ్ పాయింట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో సిబ్బంది ప్రమాదాలు జరిగిన సమయంలో వచ్చిన సమాచారంతో సమీపంలోని ఆఫీసర్లను అలర్ట్ చేస్తారు. వైద్యం, పోలీసు విభాగాల అనుసంధానంతో అగ్నిమాపక శాఖ డయల్ 101 కాల్ సెంటర్ ఉండేలాగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 24 గంటలు కాల్ సెంటర్లో అందుబాటులో ఉండే విధంగా 16 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. ఈ కాల్ సెంటర్‌లో లొకేషన్ ఆధారంగా సేవలు అందించే విధానం ఉంటుంది. ప్రమాదాల గురించి కాల్ వచ్చిన వారి లొకేషన్‌ను ట్రేస్ చేసి చర్యలు చేపడతారు. ఎస్‌ఎంఎస్, వెబ్ అప్లికేషన్ల ద్వారా సైతం ప్రజల నుంచి సమాచారం తీసుకుని వారి సమస్యలు తీర్చనున్నారు.
2022లో సెప్టెంబరులో నిర్మాణం ప్రారంభమైన ఈ భవనం ఇటీవలే పూర్తయింది. మొత్తం ఆరు అంతస్తుల భవనంలో సెల్లార్ పార్కింగ్, ఇతర అవసరాలకు గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో అగ్నిమాపక కేంద్రం, రెండో ఫ్లోర్లో కమాండ్ కంట్రోల్ కేంద్రం, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి కార్యాలయం, మూడో అంతస్తులో సిబ్బంది, పరిపాలన అవసరాల కోసం ఉపయోగిస్తారు. నాలుగో అంతస్తులో అగ్నిమాపక శాఖ డీజీ కార్యాలయం, బోర్డు రూమ్ ఉంటాయి.
Telangana Fire Department : 'ఎలాంటి రెస్క్యూకైనా మేం రెఢీ'.. తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ