Sammakka Sarakka Special Trains : దక్షిణ మధ్య రైల్వే మేడారం సమ్మక్క - సారక్క జాతరకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు పండుగ జరగనున్నందున యాత్రికుల ప్రయాణ సౌకర్యార్థం నాలుగు రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు యాత్రికులు మేడారం చేరుకోవడానికి వీలుగా సమీప వరంగల్ స్టేషన్ వరకు వివిధ ప్రాంతాల నుంచి నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లతో ఈ నెల 21న నుంచి నడిపించనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. 30 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లలో 10 రైళ్లు సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్ మధ్య, 8 రైళ్లు సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్- సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య, 8 రైళ్లు నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ మధ్య, 2 రైళ్లు ఆదిలాబాద్-వరంగల్-ఆదిలాబాద్ మధ్య, 2 రైళ్లు ఖమ్మం-వరంగల్- ఖమ్మం మధ్య నడుస్తాయని రైల్వే శాఖ తెలిపింది.
దారులన్నీ మేడారం వైపే - మహా జాతరకు పోటెత్తుతోన్న భక్త జనం - అమ్మవార్ల గద్దెల చెంత కోలాహలం
ప్రత్యేక రైళ్ల వివరాలు
1. సికింద్రాబాద్ - వరంగల్ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు ఈ నెల 21 నుంచి 25 వరకు ఉదయం 09:40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:00 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక రైలు 1:55 గంటలకు వరంగల్ స్టేషన్ నుంచి బయలుదేరి అదే రోజు సాయంత్రం 6:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మార్గంలో మౌలాలీ, చెర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘనపూర్, పిండియాల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతాయి.
2. సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్- సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రత్యేక రైలు : ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఉదయం 05:30 గంటలకు బయలు దేరుతుంది. అదే రోజు 10.00 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12:00 గంటలకు వరంగల్‌లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 4:00 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మార్గంలో రాలపేట, ఆసిఫాబాద్, రేపల్లెవాడ, రెచీని రోడ్డు, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల, రామగుండం, రాఘవపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూర్, ఓదెల, పొట్లూరు, పొటకపల్లి, బిసుగీర్ షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తి రోడ్, కాజీపేట టౌన్ స్టేషన్లలో ఆగుతుంది.
3. నిజామాబాద్ - వరంగల్ - నిజామాబాద్ ప్రత్యేక రైలు : ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిజామాబాద్ నుండి ఉదయం 7:05 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు 11:00 గంటలకు చేరి సికింద్రాబాద్ నుండి 11:10 గంటలకు బయలుదేరి అదే రోజు వరంగల్ 1:45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వరంగల్‌లో 2:45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ సాయంత్రం 5:20 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10:30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు కామారెడ్డి, అక్కన్నపేట, మీర్జాపల్లి, వడియారం, మనోహరాబాద్, మేడ్చల్, బొల్లారం, మాల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చెర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, జనగామ, రఘునాథపల్లి, ఘణపూర్, పిండియాల, కాజీపేట స్టేషన్లలో ఆగుతాయి.
4. ఆదిలాబాద్ - వరంగల్ - ఆదిలాబాద్ ప్రత్యేక రైలు : వరంగల్‌లో 4 గంటలకు బయలుదేరి నిజామాబాద్‌కు రాత్రి 8:35 గంటలకు చేరుకుని, మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుంది. ఆదిలాబాద్‌లో రాత్రి 11:30 గంటలకు బయలుదేరి నిజామాబాద్‌కు ఉదయం 5:20, 5:30 గంటలకు చేరుకుని మరుసటి రోజు 12:45 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, హసన్‌పర్తి రోడ్, జమ్మికుంట, పెద్దపల్లి, సుల్తానాబాద్, కరీంనగర్, గంగాధర, లింగంపేట్ జగిత్యాల్, కోరుట్ల, మెట్‌పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్, బాసర్, ధర్మాబాద్, ఉమ్రీ, ముద్‌ఖేడ్, భోకర్, హడ్గావ్ రోడ్, హిమాయత్‌నగర్, సహస్రకుండ్, ధనోరా, కిన్వాట్, అంబారీ స్టేషన్లో ఆగుతాయి.
5. ఖమ్మం – వరంగల్ - ఖమ్మం ప్రత్యేక రైలు : ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరి అదే రోజు 12:20 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 23వ తేదీన 01:55 గంటలకు వరంగల్‌లో బయలుదేరి అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మల్లెమడుగు, పాపటపల్లి, డోర్నకల్, గుండ్రాతిమడుగు, మహబూబాబాద్, కేసముద్రం , నెక్కొండ , చింతల్‌పల్లి స్టేషన్లలో ఆగుతాయి. అన్ని ప్రత్యేక రైళ్లలో సెకండ్ క్లాస్ సీటింగ్ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.
ములుగు జిల్లా, మేడారం ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తాం : మంత్రి సీతక్క
ఈసారీ మేడారానికి హెలికాప్టర్ సేవలు - 'ప్రత్యేక జాయ్ రైడ్' - టికెట్ ధరలు ఇవే