ETV Bharat / state

ఈసారీ మేడారానికి హెలికాప్టర్​ సేవలు - 'ప్రత్యేక జాయ్‌ రైడ్‌' - టికెట్‌ ధరలు ఇవే - Devotees Rush to Medaram

Sammakka Sarakka Jatara 2024 : మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. వనదేవతల దర్శనం మరింత సులభతరంగా చేసుకునేలా మేడారం జాతర సుందర దృశ్యాల విహంగ వీక్షణానికి హెలికాఫ్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Helicopter Services for Medaram Jatara 2024
Sammakka Sarakka Jatara 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 8:47 AM IST

మేడారానికి హెలికాఫ్టర్ సేవలు - ప్రత్యేక జాయ్‌ రైడ్‌ టికెట్‌ ధర రూ. 4,800

Sammakka Sarakka Jatara 2024 : గతంలో మేడారం జాతరకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన, ఎడ్ల బండ్లపై తల్లుల దర్శనానికి వచ్చేవారు. ఇప్పటికీ పరిసర ప్రాంత ప్రజలు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుండగా, ఏళ్లు గడిచేకొద్దీ సౌకర్యాలు పెరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు భక్తులను జాతరకు చేరుస్తున్నాయి. పెరుగుతున్న రద్దీ కారణంగా భక్తుల కోసం రాష్ట్ర పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులు దేవతలను దర్శించుకుని, గగన విహారం చేస్తూ జాతర తిలకిస్తూ ఆనందంగా గడిపే అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పించనుంది.

మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు - 6 వేల ప్రత్యేక బస్సులు

Helicopter Services for Medaram Jatara 2024 : హైదరాబాద్, హనుమకొండ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో మేడారం వరకు హెలికాఫ్టర్ సర్వీసులను నడుపనున్నారు. ఇందులో ప్రయాణించే వారికి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు. మేడారం పరిసరాల అందాలను వీక్షించేందుకు భక్తుల కోసం ప్రత్యేకంగా మేడారంలో హెలికాఫ్టర్ జాయ్ రైడ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో సేవలందించిన ప్రైవేటు సంస్థతోనే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఈ సేవలను అందుబాటులోకి తెస్తుంది.

వరంగల్ నుంచి మేడారానికి వెళ్లి తిరుగు ప్రయాణానికి రూ.28 వేల 999 రూపాయలు, మేడారంలో జాయ్‌ రైడ్‌ కోసం రూ.4,800 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ సేవలను కూడా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

మహాజాతరకు మరమ్మత్తుల 'బాట' - ముమ్మరంగా కొనసాగుతున్న పనులు

"గత ఐదు సంవత్సరాలుగా మేడారంలో హెలికాప్టర్ సేవలు అందిస్తున్నాం. హెలికాప్టర్​లో ఎలాంటి ప్రమాదం కాకుండా ఒక రోజు ట్రయల్​ రన్ కూడా చేస్తున్నాం. గతంలో సేవలందించిన ప్రైవేటు సంస్థతోనే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని భక్తులకు హెలికాప్టర్ సేవలు అందిస్తున్నాం." -ఇలా త్రిపాఠి, ములుగు జిల్లా కలెక్టర్

Devotees Rush to Medaram Sammakka Sarakka Temple : జాతర సమయంలో 15 టన్నులకు పైగా బెల్లం అమ్మకాలు జరుగుతాయని అంచనా. సాధారణ రోజుల్లో నెలలో సుమారు 20 క్వింటాళ్ల వరకు ఖరీదు జరిగేదని, జాతర సమయంలో 40 నుంచి 50 క్వింటాళ్ల అమ్మకాలు జరుగుతాయని ఉమ్మడి వరంగల్లోని బెల్లం వ్యాపారస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి తల్లులను దర్శించుకుంటున్నారు. చల్లగా చూస్తే మళ్లీ జాతరకు వస్తామని తల్లులను వేడుకుంటున్నారు. కుటుంబ సమేతంగా మేడారం అభయారణ్యంలో వన భోజనాలు చేసి ఉల్లాసంగా గడుపుతున్నారు.

మేడారం జాతరలో ధరల మోత - లీటర్ వాటర్ బాటిల్ ఎంతో తెలిస్తే షాక్?

సమ్మక్క-సారక్కలకు ఆన్​లైన్​లో నిలువెత్తు బంగారం - కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.