ETV Bharat / state

ఈ విద్యాలయం - సైనికులను తయారు చేసే కర్మాగారం - Sainik School In Warangal

దేశ రక్షణకు మెరికల్లాంటి సైనికులను తయారు చేస్తున్న ఆర్మ్​డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమి - ఈ పాఠశాలలో చదివితే సరిహద్దుల్లో డ్యూటీ గ్యారెంటీ!

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

WARANGAL SAINIK SCHOOL
Warangal Sainik School History (ETV Bharat)

Warangal Sainik School History : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ ​నగర్​లోని సైనిక్ స్కూల్​లోని ఆర్మ్​డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమి దేశ రక్షణకు మెరికల్లాంటి సైనికులను తయారు చేస్తుంది. ఈ స్కూల్​లో చదివిన పలువురు విద్యార్థులు సరిహద్దుల్లో సైనికులుగా పని చేస్తూ దేశ రక్షణలో పాలు పంచుకుంటున్నారు. ఈ విద్యాలయంలో చేరిన నిరుపేద గిరిజన విద్యార్థులకు విద్య, వసతితో పాటు వ్యాయామం, దేహదారుఢ్యం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.

పలు అంశాలను నేర్చుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే శారీరక, రాత పరీక్షలను సులువుగా అధిగమించి భారత సైన్యం, అగ్నివీర్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎప్, నేవీ, పోలీసు విభాగాల్లో ఎంపికై సేవలందిస్తున్నారు. 1984లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనలో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాల అంచెలంచెలుగా అభివృద్ది చెంది సైనిక్ స్కూల్​గా ఎదిగింది. 2022,2023 విద్యా సంవసత్సరాల్లో త్రివిధ రక్షణ దళాలు, భద్రత, తదితర విభాగాల్లో 22 మంది సేవలందిస్తున్నారు. అగ్నివీర్​కు (ఆర్మీలో) నలుగురు, జీడీఎస్​ పోస్టల్​కు ముగ్గురు, ఫైర్​మెన్​కు ఏవోసీకి ఒకరు, సీఆర్పీఎఫ్​కు ఒకరు, బీఎస్ఎఫ్​కు ఒకరు, భారత సైన్యానికి ఐదుగురు, నావికా దళానికి ఇద్దరు, టీఎస్ పోలీస్ కానిస్టేబుళ్లుగా ఐదుగురు ఎంపికయ్యారు.

Warangal Sainik School History
ఈ విద్యాలయం - సైనికులను తయారు చేసే కర్మాగారం (ETV Bharat)

"సైనిక్‌ స్కూల్‌లో ఇంటర్‌లో చేరాను. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా ఆర్మీకి ఎంపికయ్యాను. ఇక్కడి అధ్యాపకులు ఇచ్చిన శిక్షణ వల్లే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో పని చేస్తున్నా. దేశ రక్షకుడిగా పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు." - సైనిక్ స్కూల్ విద్యార్థి

"ఇంటర్‌లో పాఠశాలలో చేరాను. భారత సైన్యానికి ఎంపికయ్యేందుకు అధ్యాపకులు, ఇన్‌స్ట్రక్టర్లు అందించిన శిక్షణ తోడ్పడింది. తక్కువ సమయంలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది." -జవిందర్‌, సైనిక్ స్కూల్ విద్యార్థి

క్రమశిక్షణతో చదివితే ఉద్యోగాలు సాధించడం సులువని సైనిక్‌స్కూల్‌ విద్యార్థులు నిరూపించారని సైనిక్ స్కూల్ పిన్సిపల్ అశోక్ తెలిపారు. సైనిక్​ స్కూల్​లో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని ఆయన తెలిపారు. అందరి కృషితోనే ఇది సాధ్యమైందని పిన్సిపల్ అన్నారు.

NCC Cadets From Telangana at All India Thal Sainik Camp : జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల ఎన్​న్​సీసీ విద్యార్థులు..

సైనిక బలగాల్లో యూపీ టాప్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.