ETV Bharat / state

YUVA - చేపలపై యువ పరిశోధకుడి రీసెర్చ్​ - వరల్డ్‌ జర్నల్స్‌లో కథనాలు - Young Man Research on Fishes - YOUNG MAN RESEARCH ON FISHES

Man Research on Fishes : సహజంగా మనందరికీ తెలిసిన చేపలు బొచ్చె, రాగండి, కొరమీను, బంగారుతీగ, పులస వంటివి తరచు చూస్తుంటాం. వింటుంటాం. తింటుంటాం. కానీ తెలియని చేపల రకాలు చాలా ఉన్నాయి. వలస చేపలూ ఉంటాయని మీకు తెలుసా? అసలు చేపలు ఎన్ని రకాలు, వాటితో ఆరోగ్య ప్రయోజనాలేంటీ? అవి అంతరించిపోవడానికి కారణాలు, వాటిని సంరక్షించుకోవాల్సిన అవశ్యకత, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలపై పరిశోధనలు చేస్తున్నాడా యువకుడు. పట్టుదలతో ప్రయత్నాలు చేసి తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ అందుకున్న సాయికుమార్‌ సాధించిన పరిశోధన వివరాలు ఇవి.

Man Research on Fishes
Young Man Doing From Siddipet Research on Fishes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 4:30 PM IST

Young Man Doing From Siddipet Research on Fishes : తండ్రి చేస్తున్న వృత్తిని చిన్నప్పటి నుంచి గమనించాడీ యువకుడు. అలా మత్స్య సంపదపై ఆసక్తి పెంచుకున్నాడు. దానికి తగ్గ చదువునే ఎంచుకుని వినూత్నంగా ప్రతిభ కనబరుస్తున్నాడు. ప్రభుత్వ విద్యాసంస్థలోనే చదువుకుంటూ మత్స్యశాస్త్రానికి అనుబంధంగా ఇప్పటి వరకు 6 పరిశోధనలు చేశాడు. అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి.

ఖమ్మం జిల్లా తీర్ధాల గ్రామానికి చెందిన సాయికుమార్‌ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ ఫిషరీస్‌ పూర్తి చేసుకున్నాడు. తండ్రి భూక్యా బాసు వృత్తిరీత్యా జాలరి. దీంతో ఇతడికి చేపలు పట్టడంపై మరింత ఆసక్తి కల్గింది. డిగ్రీ బీజెడ్​సీ చదివుతూనే ఖాళీ సమయాల్లో చేపలు, వాటి రకాలు తెలుసుకోవడంపై ఆసక్తి చూపాడు. తనకున్న అమితాసక్తితో 100 రకాల చేప జాతులు వాటి శాస్త్రీయ నామాలు అనర్గళంగా చెప్పే నైపుణ్యాన్ని సాధిచాడు.

డిగ్రీలో మత్స్యరంగంపై పరిశోధనలకు బీజం వేసుకున్నాడు సాయి. ఆ లక్ష్యంతో ఎమ్మెస్సీ ఫిషరీస్‌ చదివి పరిశోధనలతో దూసుకుపోతున్నాడు. అధ్యాపకులు, తండ్రి సహకారంతో సెలవు రోజుల్లోనూ వివిధ జాతులపై పరిశోధనలు చేశాడు. ఆక్వాటిక్‌ బయోడైవర్సీటీ, కన్జర్వేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో భాగంగా వివిధ రకాల జాతులకు చెందిన చేపలను సేకరిస్తున్నాడు. అలా ఇప్పటి వరకు 50 రకాలను కనుగొన్నాడు ఈ యువకుడు.

పరిశోధనతో తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్ అవార్డు : అంతరించిపోతున్న వివిధ చేప జాతుల రకాలను ప్రధానంగా గుర్తిస్తున్నాడు సాయి. ముఖ్యంగా మల్గు మీను, మెుయ్యి చేప, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా లభించే మగదుమ్మ, మణిపూర్‌కు చెందిన చేప ఓస్ట్రియో బ్రామా బెలగారని వంటి రకాలు ఇతని పరిశోధలో ఉన్నాయి. ముందు తరాల కోసం వీటి నమూనాలను ల్యాబ్‌లో భద్రపరిచినట్లు ఈ యువకుడు చెబుతున్నాడు . ఇలా వినూత్నంగా పరిశోధనలు చేసి తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్ సాధించాడు సాయి.

రాష్ట్రంలో 30 జాతులకు చెందిన చేపలు ఉన్నాయి. అందులో ఒక్క జాతికి చెందినవే 90 వరకు ఉన్నాయి. మిగిలిన ఇతరత్రా జాతులవి. మత్స్యశాస్త్రానికి అనుబంధంగా ఇప్పటి వరకు 6 పరిశోధనలు చేయగా వాటికి సంబంధించిన అంశాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. అంతరించిపోతున్న చేపలు, కృత్రిమంగా చేప పిల్లల ఉత్పత్తి, సమీకృత చేపల పెంపకం వంటి అంశాలపై ఇంకా పరిశోధనలు చేస్తున్నాడు.

నిర్దేశించుకున్న లక్ష్యం కోసం పట్టుదలతో ప్రయత్నాలు చేశాడు సాయి. చదువుల్లో రాణిస్తూనే చేపలపై పరిశోధనలు చేశాడు. వివిధ ప్రాంతాల్లోని మత్స్యకారులను సంప్రదించి, చేపల్లో వచ్చే రోగాలు తెలుసుకున్నాడు. ఆ వ్యాధుల నివారణకు పూనుకుంటున్నాడు. అధ్యయనాల ఫలితాల ఆధారంగా రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఆక్వాకల్చర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతున్నాడు.

పరిశోధనలతో ప్రొఫెసర్‌ కావాలని లక్ష్యంగా : కళాశాల ప్రోత్సాహంతో పరిశోధనలు విజయవంతంగా పూర్తి అవుతున్నాయని చెబుతున్నాడు సాయి. మిగిలిన కళాశాలలతో పోలిస్తే ఇక్కడ థియరీ పార్ట్‌ కంటే ప్రాక్టికల్స్‌ ఎక్కువ ఉండటంతో మరింతగా కలిసి వచ్చిందని అంటున్నాడు. కళాశాల ప్రాంగాణంలోనే ఆక్వాకల్చర్‌ను ఏర్పాటు చేసుకుని, క్రాస్‌ బ్రీడింగ్‌ ద్వారా చేపల ఉత్పత్తిని పెంచే విధంగా కృషి చేస్తున్నాడు ఈ పరిశోధకుడు.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ప్రొఫెసర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాడు సాయికుమార్‌. ఉన్నత చదువుల కోసం ఏపీఆర్​ సెట్‌కు ఇటీవల అర్హత సాధించాడు. భవిష్యత్తులో పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రొఫెసర్‌ అయ్యి ఆక్వారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లె ఆశయం పెట్టుకున్నాడు. ఆ దిశగా తన పరిశోధనలు కొనసాగిస్తున్నాడు ఈ యువకుడు.

'ప్రస్తుతం నేను ఎమ్మెస్సీ ఫిషరీస్‌ చేస్తున్నా. ఈ కోర్సులో జాయిన్​ అయినప్పటీ నుంచి చేపలపై రీసెర్చ్​ మొదలు పెట్టాను. తెలంగాణలో ఈ ఒక్క కాలేజీలోని ఎమ్మెస్సీ ఫిషరీస్​ కోర్సు అందుబాటులో ఉంది. చేపలపై రీసెర్చ్​ చేసి రాష్ట్రంలోని అవి ఎన్ని రకాలు, ఎన్ని జాతులు ఉన్నాయని తెలుసుకున్నాం. దీనిపై పరిశోధనలు చేయడంతో 2023లో తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్​లో నాకు అవార్డు వచ్చింది'- సాయికుమార్‌, యువ పరిశోధకుడు

YUVA : పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సందీప్‌ - 25వేలకు పైగా పలురకాల విత్తనాల సేకరణ - sandeep establish green environment

YUVA : పేదరికం వెంటాడుతున్నా తగ్గలేదు - పార్ట్​టైం జాబ్ చేస్తూ తెలుగు కబడ్డీ లీగ్​కు ఎంపికైన నల్గొండ వాసి - Kabaddi Player Ajay From Yadadri

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.