ETV Bharat / state

దీపావళి పండుగ రోజు మీ పెట్స్​ విషయంలో ఈ జాగ్రత్తలు మరవొద్దు

దీపావళి రోజున పెట్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు - ఈ టిప్స్​ పాటిస్తే పెట్స్​తో పాటు హ్యాపీగా దీపావళి పండుగను ఎంజాయ్​ చేయొచ్చు!

Pets Care During Diwali 2024
Pets Care During Diwali 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Pets Care During Diwali 2024 : చీకటిని పారద్రోలి కొత్త వెలుగులు నింపే పర్వదినమే దీపావళి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. దీపావళి సమయంలో చాలా మంది పలు జాగ్రత్తలు తీసుకుంటారు. మరి పెంపుడు జంతువులు(పెట్స్​) విషయంలో కూడా అలాంటి శ్రద్ధే తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ సమయంలో వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అతి ముఖ్యమైన బాధ్యత మనపై ఉంది. పెంపుడు జంతువులు బాంబుల శబ్దాలకు భయపడతాయని మనకి తెలుసు. వాటి భద్రతకు పలు జాగ్రత్తలు తీసుకుని వాటితో పాటు మీరు కూడా పండగను చేసుకుంటే అది ఆనంద దీపావళి అవుతుంది. ఈ దీపావళి పర్వదినం రోజు మీ పెంపుడు జంతువులను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. నీరు, ఆహారం పెట్టండి : దీపావళి వేళ బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణం పొడిగా మారుతుంది. దీని ఫలితంగా పెంపుడు జంతువులకు దాహార్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే పెట్స్​కు ఇంటిలో ఒక సురక్షితమైన గదిలో నీరు, ఆహారాన్ని పెట్టండి.
  2. దీపాలు, లైట్లకు దూరంగా ఉండండి : దీపాలు, లైట్లు, విద్యుత్ కనెక్షన్‌లకు పెంపుడు జంతువులను దూరంగా ఉంచండి. అవి వెలుగుతున్న సమయంలో వాటిని లాగడానికి ప్రయత్నిస్తాయి. అందువల్ల వాటికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక అందుబాటులో ఉండేలా లైట్లు, దీపాలు పెట్టకండి.
  3. స్వీట్లు దూరంగా ఉంచాలి : దీపావళి పండుగ సమయంలో ఇళ్లలో ఎక్కువగా స్వీట్స్​ చేస్తుంటారు. అయితే స్వీట్లు పెంపుడు జంతువుల ఆరోగ్యానికి హానికరం. అందువల్ల పెట్స్​ను స్వీట్లకు దూరంగా ఉంచండి. లేదంటే అవి జీర్ణ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. వాటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్స్​ను, తగు పరిమాణంలో వాటికి ఇవ్వండి.
  4. బాణసంచాకు దూరంగా ఉంచండి : మీ పెంపుడు జంతువు దగ్గర బాణాసంచా(టపాసుల) పెట్టెలు ఉంచవద్దు. ఎందుకంటే వాటిలో ఏముందో అనే ఆతృతతో వాటిని కొరికేందుకు ప్రయత్నిస్తాయి. దీని వల్ల వాటి ఆరోగ్యం దెబ్బతినే ఆస్కారం ఉంది.
  5. కాటన్​ యూజ్​ చేయండి : పెద్ద పెద్ద ధ్వనులు పెంపుడు జంతువుల్లో ఆందోళనలు కలిగిస్తాయి. టపాసులు కాల్చే సమయంలో వాటి చెవుల్లో దూది పెట్టడం వల్ల ఆ సమస్య నుంచి కొంత మేర ఉపశమనం కలిగించవచ్చు. అయితే, కొన్ని కుక్కలు చెవుల్లో దూది పెట్టుకున్నప్పటికీ భయపడతాయి. అవి భయపడకుండా ఉండేందుకు వాటిని సౌండ్ ప్రూఫ్ గదిలో లేకుంటే అవి సౌకర్యవంతంగా ఉండే ప్రదేశాల్లో ఉంచడం చాలా అవసరం.
  6. ప్రథమ చికిత్స పెట్టెను అందుబాటులో ఉంచుకోవాలి : టపాసులు కాల్చే సమయంలో చాలా మంది ఫస్ట్​ ఎయిడ్​ బాక్స్​(ప్రథమ చికిత్స పెట్టెను) అందుబాటులో ఉంచుకుంటారు. ఆ విధానాన్నే మీ పెట్స్​ విషయంలోనూ పాటించండి. అనుకోకుండా మీ పెట్​కు ఏమైనా జరిగితే ఫస్ట్​ ఎయిడ్​ బాక్స్​ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు.
  7. జంతువులపై క్రాకర్స్​ విసరొద్దు : టపాసులు కాల్చే సమయంలో చాలా మంది ఆకతాయిలు వీధి కుక్కలు, లేదా పెట్స్​పై క్రాకర్స్​ను విసిరేస్తారు. ఆ పని వల్ల పెట్స్​కు తీవ్ర గాయాలవుతాయి. ముఖ్యంగా వీధి కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి ఉండడానికి ఆవాసం ఉండదు. అందుకే వాటి విషయంలో కాస్త దయతో వ్యవహరించాలి.
  8. శుభ్రత పాటించండి : బాణాసంచాలో ఉండే రసాయనాల వల్ల పెంపుడు జంతువులు బాగా ఇబ్బంది పడతాయి. కనుక వాటికి దూరంగా ఉంచండి. లేకుంటే వాటివల్ల పెట్స్​కు దద్దుర్లు లేదా అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. దీపావళి వేడుకలు ముగిసిన వెంటనే పరిసరాలను శుభ్రం చేయండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు పెట్స్​తో పాటు హ్యాపీగా దీపావళి పండుగను ఎంజాయ్ చేయవచ్చు.

వెలుగుల పండుగ వేళ : టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు మరవొద్దు!

దీపావళి నాడు పెరుగుతో ఇలా చేశారంటే - మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.