Sadia Received 9 Medals in Power Lifting: సహజంగా ఐపీఎస్ కావాలంటే పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు చాలా మంది. కానీ ఈ యువతి ఐపీఎస్ కలను నేరవేర్చుకోవాడానికి పవర్ లిఫ్టర్ అయింది. చిన్నప్పటి నుంచి తన తండ్రి పవర్ లిఫ్టర్‌గా రాణించడం చూస్తూ పెరిగిన సాదియా అల్మాస్ తను కూడా ఆ రంగంలో మంచి గుర్తింపును సాధించాలని నిర్ణయించుకుంది. ఐపీఎస్ కావాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలని ఈ రంగాన్ని ఎంచుకున్నానని చెప్తుంది సాదియా.
అమ్మాయిలను ఇంటి నుంచి బయటకు పంపడానికి చాలా మంది సంశయిస్తారు. అటువంటిది తండ్రే కుమార్తెకు గురువుగా మారాడు. పవర్ లిఫ్టింగ్ పోటీలకు శిక్షణ ఇచ్చాడు. షేక్ సాదియా అల్మాస్ గుంటూరు జిల్లా మంగళగిరి నివాసి. తండ్రి ప్రేరణతో 2017లో పవర్ లిఫ్టింగ్‌లో అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. ఏషియన్ గేమ్స్‌లో రెండు రికార్డులను బ్రేక్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో 9 మెడల్స్ అందుకుని ఔరా అనిపించింది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటింది. భవిష్యత్‌లో ప్రపంచ స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించటమే లక్ష్యమని సాదియా చెబుతున్నారు.
యూనివర్శిటీ స్థాయి నుంచి మొదలు పెట్టిన సాదియా గెలుపు ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఆరేళ్లలోనే అద్భుత ప్రతిభ కనబరిచి దేశ చరిత్రలోనే తనదైన ముద్రవేసింది ఈ క్రీడాకారిణి. 2023లో డెడ్ లిఫ్టింగ్, స్క్వాడ్ లిఫ్టింగ్‌ల్లో రికార్డును సాధించింది. వీటితో పాటుగా ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం, స్ట్రాంగ్ గర్ల్ ఆఫ్ ఏషియన్ అనే టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
సాదియా అల్మాస్ ఇప్పటివరకు ఐదుసార్లు ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని నాలుగు పసిడి పతకాలు, ఒక బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. తొమ్మిది అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎనిమిది పతకాలు, జాతీయ స్థాయిలో 15 పతకాలు సాధించింది. రాష్ట్రం నుంచి ఇప్పటివరకు ఏ మహిళ పవర్ లిఫ్టింగ్ సాధించలేని రికార్డులు సాదియా సొంతం చేసుకుంది.
నాకు అవకాశం కల్పిస్తే మరింతగా రాణిస్తాను. ఇన్ని పతకాలు సాధించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. ప్రభుత్వం ప్రతిభను గుర్తించి ఉద్యోగం ఇప్పించాలి. -సాదియా
చూపు లేకపోయినా ఫోన్లో క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్లు- రోజూ జిమ్‌లో వ్యాయామం
తండ్రి శిక్షకుడు కావటంతో ఎక్కువ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడే అవకాశం దొరికిందని సాదియా చెబుతోంది. నిత్యం మూడు గంటలు సాధన చేస్తూ పోటీలకు ముందు ఐదు నుంచి ఆరుగంటలు కఠోర శ్రమ చేస్తుంది. ఇన్ని పతకాలు సాధించినా ప్రభుత్వం నుంచి ఆర్ధికసాయం అందలేదని ఈ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తండ్రి సంధాని 2004లో జరిగిన ఏషియన్ బెంచ్ ప్రెస్ ఇండియా తరపున పాల్గొని బంగారు పతకం సాధించాడు. అనంతరం సొంతగా వ్యాయామశాల ఏర్పాటు చేసుకుని నూతన పవర్, వెయిట్ లిఫ్టర్లకు శిక్షణనిస్తున్నాడు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. పోటీల్లో పాల్గొనాలంటే ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. చెబుతున్నారు. పెద్ద కుమార్తె ఎంబీబీఎస్ చదువుతూనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ తరపున పవర్ లిఫ్టింగ్‌లో పాల్గొని పతకాలు సాధిస్తోంది.ఇద్దరు కుమార్తెలు పవర్ లిఫ్టింగ్‌లో రాణించటం అదృష్టం, చాలా ఆనందంగా ఉంది. -సందాని, సాదియా తండ్రి
'గురి' తప్పని బుల్లెట్ - రైఫిల్ షూటింగ్‌లో పతకాల పంట పండిస్తోన్న యువ కెరటం