ETV Bharat / state

ఆర్టీసీ డ్రైవర్​పై ప్రయాణికుడి దాడి - బస్సులు తీసేదే లేదంటూ ధర్నాకు దిగిన సిబ్బంది - RTC Drivers Protest in Vikarabad

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 2:09 PM IST

RTC Drivers Protest in Vikarabad : ఓ ప్రయాణికుడు ఆర్టీసీ డ్రైవర్లు భోజనం చేస్తున్న సమయంలో బస్సులోకి వచ్చి వీరంగం సృష్టించాడు. ఏకంగా కండక్టర్​, డ్రైవర్లపై దాడికి దిగాడు. ఈ ఘటనకు నిరసనగా ఆర్టీసీ డ్రైవర్లు డిపోలో బస్సులను నిలిపివేశారు. ఆ ప్రయాణికుడిపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని డిమాండ్​ చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.

RTC Drivers Demand to Provide Protection
Passenger Attack on Bus Driver in Vikarabad
ఆర్టీసీ డ్రైవర్​పై ప్రయాణికుడి దాడి - బస్సులు తీసేదే లేదంటూ ధర్నాకు దిగిన సిబ్బంది

RTC Drivers Protest in Vikarabad : ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు భోజనం చేసే సమయంలో బస్సును ప్లాట్​ఫామ్ వద్ద కాకుండా డిపోలో ఓ పక్కన నిలిపి ఉంచుతారు. ఆ సమయంలో ఆ బస్సులో ఎవరూ ఎక్కడానికి ఉండదు. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ డ్యూటీ ఎక్కుదామనుకున్న డ్రైవర్, కండక్టర్​ను ఓ ప్రయాణికుడు వచ్చి బస్సు ఎప్పుడు బయల్దేరుతుందని అడిగాడు. వారు భోజనం అయ్యాక బయల్దేరతామని చెప్పారు. అయితే అది అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తి గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా డ్రైవర్​పై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనను మిగతా డ్రైవర్లు ఖండించారు. ప్రయాణికుడి తీరుకు నిరసనగా డిపోలో సుమారు 45 బస్సులను నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లాలో జరిగింది.

డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం : వికారాబాద్​ జిల్లాలో ఆర్టీసీ డిపోలో ప్రయాణికుడు నవాజ్​ బస్సు ఆలస్యం అవడంతో వికారాబాద్ డిపో డ్రైవర్​ రాములును ఎప్పుడు తీస్తారని అడిగాడు. భోజనం చేసి ఐదు నిమిషాల్లో తీస్తామని రాములు బదులిచ్చాడు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఆగ్రహానికి గురైన నవాజ్ రాములుతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దాడి చేశాడు. ఈ ఘటనపై వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్​, కండక్టర్​లు కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Heat Effect on Bus Drivers in Hyderabad : మండే ఎండలోనూ.. బస్సు 'రయ్ రయ్' అనాల్సిందే

"ప్రయాణికుడు వచ్చి బస్సు తీయరేంటని అడిగాడు. తిన్న తరవాత ఫ్లాట్​ఫాం మీద పెడతామని చెప్పాం. దాంతో మాపై దుర్భాషలాడాడు. మర్యాదగా కాసేపు ఆగమని చెప్పాం. మాపై చేయి చేసుకున్నాడు. మాకు డిపో అధికారుల నుంచి కూడా న్యాయం జరగలేదు. మేము రక్షణ కల్పించాలని నిరసన చేస్తున్నాం. ఇలాంటివి మరోసారి జరగవని హామీ ఇచ్చేంత వరకు బస్సులు తీయం. ప్రయాణికులు మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం." - నరేష్ ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్, వికారాబాద్

RTC Drivers Demand to Provide Protection : మరోవైపు వికారాబాద్ డిపో​ డ్రైవర్లు, కండక్టర్లు కలిసి ఆర్టీసీ బస్టౌండ్ దగ్గర నిరసన చేపట్టారు. దీంతో దాదాపు 45 ప్రైవేట్​ బస్సులు నిలిచిపోయాయి. తమకు రక్షణ కల్పించేంత వరకు విధులకు హాజరవ్వమని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేలా హామీ ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. బస్సులు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

RTC problems: తిండి దొరకదు.. నిద్ర పోలేరు.. బస్టాండ్లలో డ్రైవర్లు, కండక్టర్ల కష్టాలు

Rtc drivers: ప్రైవేట్​ టీచర్ల మాదిరిగా ఆర్థిక సాయం అందించాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.