RTC Conductor Chased Thief in Uppal of Hyderabad : జనగామకు చెందిన అరవింద్‌చంద్ర ఉప్పల్‌లోని విజయపురికాలనీలో ఉంటూ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం కాలేజీకి వెళ్లి బస్సులో తిరిగి వస్తున్నాడు. ఉప్పల్ రింగు రోడ్డు సమీపంలోని సబ్‌స్టేషన్ వద్ద బస్టాప్ తర్వాత అక్కడ దిగేందుకు ఫుట్‌బోర్డు పైకి వచ్చాడు. ఇదే సమయంలో ఓ దొంగ అరవింద్‌చంద్ర జేబులోని సెల్‌ఫోన్‌ను కొట్టేసి బస్సు దిగి పరుగందుకున్నాడు.
ఇదంతా గమనించిన ఆ విద్యార్థి అరవడంతో చెంగిచర్ల డిపోలో కండక్టర్‌గా పని చేసే రాములు దొంగ వెంట పరుగెత్తాడు.(ఇతను ఉప్పల్ రింగురోడ్డులోని సబ్‌స్టేషన్ బస్టాప్ వద్ద ప్రయాణికులకు సహాయకుడిగా పని చేస్తున్నాడు.) ఈ క్రమంలో దొంగ రాములుపైకి రాళ్లు రువ్వుతూ రోడ్డుకు అటూ ఇటూ పరుగులు తీశాడు. అయినా అతను వదిలి పెట్టలేదు. దొంగను పట్టుకోగానే రోడ్డుపై పడిపోయినట్టు డ్రామా చేశాడు. అయినా వదిలి పెట్టలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ దొంగను వారికి అప్పగించారు.
పోలీసులు ఏం చేశారంటే : ఎంతో కష్టపడి దొంగను ఆర్టీసీ కండక్టర్, ఇతర సిబ్బంది పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. స్టేషన్‌కు రాగానే అతడు పడిపోయాడు. ఏం అడిగినా కూడా నోరు మెదపలేదు. అందులోనూ మద్యం తాగి ఉన్నాడు. దీంతో ఆ దొంగను పోలీసులు వదిలేశారు. ఎంతో కష్టపడి పట్టుకున్న దొంగను మద్యం తాగాడని పోలీసులు వదిలేయడం పలు విమర్శలకు తావిస్తోంది.
ఆరు కేసుల్లో నిందితుడు -అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులు - చివరకు ఏం జరిగిందంటే!