ETV Bharat / state

అధిక వడ్డీ ఆశచూపి రూ.700 కోట్లు స్వాహా - సీసీఎస్ ఎదుట బాధితుల ఆందోళన - Rs 700 Crore Fraud in Hyderabad - RS 700 CRORE FRAUD IN HYDERABAD

High interest Fraud in Hyderabad : అధిక వడ్డీల పేరుతో డీకేజెడ్​ టెక్నాలజీస్​ మోసం చేసిందంటూ బాధితులు బషీర్​బాగ్​లోని సీసీఎస్​ ముందు ఆందోళనకు దిగారు. మాదాపూర్​లోని ఈ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తామని రూ.700 కోట్లు సేకరించినట్లు బాధితులు వాపోయారు. ఫిర్యాదు చేసి 15 రోజులైనా పోలీసులు కనీసం పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Rs 700 Crore Fraud in Hyderabad
High interest Fraud in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 8:03 PM IST

Updated : Sep 13, 2024, 10:57 PM IST

Rs 700 Crore Fraud in Hyderabad : దాచిన సొమ్ము దెయ్యాల పాలు చేసినట్లు, కష్టపడి సంపాదించిన డబ్బును కూడబెట్టుకునేందుకు చూస్తే, అసలు పోయింది.. వడ్డీ పోయింది. మధ్య తరగతి కుటుంబాలు డబ్బును సంపాదించేందుకు ఎంత కష్టపడుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిడిల్​ క్లాస్​ వాళ్లకు ఆఫర్‌ వచ్చిందంటే చాలు వస్తువులు విరివిగా కొనేస్తుంటారు. ఒక శాతం వడ్డీ ఎక్కువ ఇస్తామంటే, ఆ సంస్థలోనే సేవింగ్స్‌ చేసుకుంటారు. అలాంటిది ఏకంగా అధిక వడ్డీ ఇస్తామని చెబితే ఊరుకుంటారా, ఇప్పుడూ అదే జరిగింది.

అధిక వడ్డీ ఆశ చూపెట్టి బిచాణా ఎత్తివేసింది మాదాపూర్​లోని డీకేజెడ్​ టెక్నాలజీస్. వందలు, వేలు కాదు, ఏకంగా ఏడు వందల కోట్లు దండుకొని ఉడాయించింది. దీంతో ఆ సంస్థ మోసం చేసిందంటూ బాధితులు బషీర్​బాగ్​లోని సీసీఎస్​ ముందు ఆందోళనకు దిగారు. ఇదే విషయంపై ఫిర్యాదు చేసి 15 రోజులైనా పోలీసులు కనీసం పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ పెట్టుబడి అధిక లాభం అంటూ డీకేజెడ్ సంస్థ నాలుగు రాష్ట్రాల్లో 30,000 మందికి పైగా బాధితులు ఉండగా, ఒక హైదరాబాదులోనే 18 వేల మంది బాధితులు ఉన్నట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే : తమ కంపెనీలో ఇన్వెస్ట్​మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని, యూట్యూబ్​లో ప్రకటనలు చేసి పలువురు బాధితుల నుంచి.. డీకేజెడ్ సొల్యూషన్స్ అనే సంస్థ కోట్లల్లో డబ్బులను దండుకుంది. కొద్ది నెలలు లాభాలు చెల్లిస్తూ, ఒక్కసారిగా కోట్లాది రూపాయలతో సంస్థ ప్రతినిధులు బిచాణా ఎత్తివేశారు. దీంతో బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఈనెల 2న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ పలువురు బాధితులు బషీర్​బాగ్​లోని సీసీఎస్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

చెన్నైకు చెందిన ఆషిఫాక్ రహిల్, ఏపీకి చెందిన మహ్మద్ ఇక్బాల్​లు 2018లో డీకేజెడ్ సొల్యూషన్స్ పేరిట మాదాపూర్​లో కార్యాలయాన్ని ప్రారంభించారు. యూట్యూబ్​లో కొంతమంది యూట్యూబర్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ప్రకటనలు చేయించారు. దీనితో నమ్మిన బాధితులు వారి కంపెనీలో ఇన్వెస్ట్​మెంట్ చేయసాగారు. పెట్టుబడిపై వచ్చిన ప్రాఫిట్​పై 10 నుంచి 12 శాతం వరకు లాభాలు ఇస్తామని తెలిపారు. మొదట లాభాలు ఇచ్చి నమ్మకం కలిగించారని, ఇన్వెస్ట్​మెంట్​ చేసిన డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చారని వాపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలి : లాభాలు వస్తున్నాయని లోన్స్ తీసుకొని, బంగారం తాకట్టు పెట్టి ఒక్కొక్కరు ఒక లక్ష నుంచి 50 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేశామన్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 30 వేల మంది వరకు రూ.700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. గత నెలలో (ఆగస్టు) మాదాపూర్​లోని కార్యాలయానికి తాళాలు వేసి ఎండీలు ఇద్దరు పరారయ్యారని, దీంతో స్థానిక మాదాపూర్ పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేస్తే, వారు సీసీఎస్​కు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. ఇక్కడ ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసికొని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.

ఆందోళన చేస్తున్న బాధితులకు మద్దతుగా ఎంబీటి పార్టీ నాయకుడు అంజాదుల్లా ఖాన్ సీసీఎస్ పోలీసులను కలిశారు. రూ.700 కోట్ల మేర ఫ్రాడ్ జరిగిందని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు. డీకేజెడ్ సొల్యూషన్స్ కంపెనీకి రూ.250 కోట్ల ఆస్తులు ఉన్నాయని, వాటి వివరాలను పోలీసులకు అందించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సీసీఎస్ డీసీపీ విచారణ అధికారిగా ఉన్నారని, ప్రత్యేక టీమ్​లు నిందితులను పట్టుకొనేందుకు గాలిస్తున్నారని బాధితులకు తెలిపారు. త్వరలో వారిని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీని ఇచ్చినట్లు వివరించారు. దీనితో బాధితులు ఆందోళనను విరమించారు.

సైబర్​ నేరగాళ్ల వికృత చేష్టలు - టార్గెట్​ రీచ్​ కాకుంటే 15 అంతస్తుల భవనం 7సార్లు ఎక్కాలి - hyderabad man escape Laos cyber den

యూపీఐ పేమెంట్లు క్యాన్సిల్ చేసి రూ.4కోట్లు కొట్టేసిన ముఠా - ఆ షోరూమ్‌లే వారి టార్గెట్​ - UPI Payments Gang Arrested

Last Updated : Sep 13, 2024, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.