Role Model Innovator In Rajanna Sirisilla : అమ్మానాన్నల రెక్కల కష్టం కళ్లారా చూసిన జక్కని హేమంత్ ఆ శ్రమ నుంచి గట్టెక్కించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు పడుతున్న శ్రమను ఉపాధ్యాయులకు వివరించడంతో యంత్ర ఆవిష్కరణకు సలహాలు సూచనలు చేశారు. దీనితో సర్కారు పాఠశాలలో చదువుతున్న హేమంత్ సైన్స్ పాఠాలను పరీక్షలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో ఉపయోగపడేలా పరికరాన్ని తయారు చేసి శెభాశ్ అనిపించుకున్నాడు. అమ్మానాన్నల, ఉపాధ్యాయుల ప్రోద్భలంతో విద్యార్ధి రోల్ మోడల్ ఇన్నోవేటర్‌గా(Role Model Innovator) నిలిచాడు హేమంత్. సిరిసిల్ల గణేశ్ నగర్లో నివాసముండే జక్కని జ్ఞానేశ్వర్ సాన్చాలు నడపగా తల్లి బీడీలను చుట్టేది. నాన్న రెండేళ్ల క్రితం కరోనాతో చనిపోయారు.
పనిలేక చేనేత కార్మికుల అవస్థలు - నిలిచిన బతుకమ్మ చీరల తయారీ
Hemanth Invented Power Loom Folding Machine : చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి సంచాల కార్ఖానాలో పనిచేస్తూ టాకాలు పట్టేవాడిని అన్న హేమంత్ ఇంత కఠినమైన పని నాన్న కష్టాన్ని చూసి బాధపడ్డానని చెప్పాడు. నాన్న దూరం కావడంతో టాకాలు పడుతున్న నాకు సంచాలపై తయారైన బట్టను (టాకాలు) సులువుగా మడత పెట్టేలా మిషన్ తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. గత ఏడాది మార్చిలో మిషన్ తయారు చేయడం మొదలు పెట్టి, దాదాపు మూడు నెలలు కష్టపడి పూర్తి చేసినట్లు చెప్పారు. మిషన్ నేత కార్మికులకు బాగా ఉపయోగ పడుతుందని ఉపాధ్యాయులు నన్ను ప్రోత్సహించారు. టాకాల మిషన్ పనితీరును ఇన్‌స్పైర్‌లో అప్లోడ్ చేశారని ఉపాధ్యాయులు తెలిపారు. హేమంత్ మొదటి నుంచి చదువులోను చాలా చురుకైన విద్యార్థి అని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
"పవర్ లూమ్‌లో బట్టను సులువుగా మడత పెట్టడానికి, కార్మికులు బట్టను తయారు చేసే సమయంలో చేతులు నొప్పితో బాధ పడకుండా ఉండడానికి యంత్రం తయారుచేశాను. దీనికి "పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్" అని పేరు పెట్టాను. ఇది పవర్‌తో నడుస్తుంది కాబట్టి చాలా తేలికగా మడత పెడుతుంది."-జక్కని హేమంత్, వస్త్రం మడత పెట్టేయంత్రం రూపకర్త, సిరిసిల్ల
Power Loom Folding Machine In Rajanna Sirisilla : హేమంత్ రూపొందించిన మిషన్ పనితీరు మెచ్చుకుంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరమగ్గాల్లో నిలబడి పని చేసే కార్మికులు ఆ తర్వాత కూడా గంటల కొద్ది నిలబడాల్సిన పరిస్థితి ఉండేదని ఉపాధ్యాయులు చెప్పారు. వస్త్రంలో ఎక్కడైనా లోపాలుంటే ప్రత్యేక అలారం మోగుతుందని చెప్పారు. ఈ యంత్రాన్ని ఇప్పటికే ఇన్స్పైర్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. చదువుతో పాటు యంత్రాల రూపకల్పన పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్న హేమంత్ ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యాయులు చెప్పారు. ప్రభుత్వం లేదా ఎవరైనా దాతలు సహాయ పడితే మాత్రం మరిన్ని ప్రయోగాలు చేస్తాడని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
"బట్టలు యంత్రం సహాయంతో మడత పెట్టడం సమస్యను మాకు హేమంత్ తెలపడంతో ఉపాధ్యాయుల సహకారంతో ఈ సమస్య పరిష్కరానికి కృషి చేశాం. ఈ యంత్రాన్ని ఇన్స్పైర్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశాం. హేమంత్ బాగా చదువుతాడు. ఏదైనా కొత్తగా తయారు చేయాలని ఆతృత ఉంది. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ఆశిస్తున్నా."-మోతీలాల్, ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాల, సిరిసిల్ల
Handloom Workers Problems : ఆధునిక కాలంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గం ఎలా?