ETV Bharat / state

రహదారి విస్తరణకు నిధులిస్తామన్న కేంద్రం- పట్టించుకోని జగన్ సర్కార్​పై ఆగ్రహావేశాలు - Delay in Road Widening works

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 8:33 PM IST

Road Construction Works Delay in Palnadu District: పల్లాడు జిల్లాలో నిత్యం వేలాది వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్లే వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో జాప్యం జరుగుతోంది. కేంద్రం నిధులు కేటాయించినా నిర్మాణ పనులు అడుగు ముందుకు పడటంలేదు. అడుగడుగునా మలుపులు, లోతైన గుంతలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా రహదారి పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Road Construction Works Delay
Road Construction Works Delay (ETV Bharat)

Road Construction Works Delay in Palnadu District: నిత్యం వేలాది వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్లే అత్యంత రద్దీ రహదారి అది. జిల్లా కేంద్రాన్ని గ్రామాలు, పట్టణాలతో అనుసంధానం చేసే ఈ రోడ్డు రద్దీకి అనుగుణంగా విస్తరణ చేపట్టకపోవడంతో ప్రమాదం జరగని రోజు లేదు. కనీసం మార్జిన్ల మరమ్మతులు చేయక వాహనాలు బోల్తాకొట్టి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా సమస్యలను అధిగమించి రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పల్నాడు జిల్లాలో నరసరావుపేట- చిలకలూరిపేట పట్టణాలను కలిపే కీలక రహదారిలో నిత్యం వేలాది వాహనాలు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. అడుగడుగునా మలుపులు, కొన్నిచోట్ల లోతైన గుంతలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల అనుసంధానించేలా జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేసే క్రమంలో కేంద్రం ఈ రహదారిని వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారిగా ప్రకటించింది. నిధులు కేటాయించినా నిర్మాణం విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

అమరావతిలో మరో రెండు రాచబాటలు - సీఆర్​డీఏ తాజా ప్రతిపాదన - Amaravathi National Highways

నాలుగు వరుసల రోడ్డుకు కేంద్రం నిధులు కేటాయింపు: బాపట్ల జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తై పనులు జరుగుతున్నా పల్నాడు జిల్లాలో భూసేకరణ కొలిక్కిరాక పనులు ప్రారంభం కాలేదు. మొత్తం 85 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించి అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.1,851 కోట్లు కేటాయించింది. వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు ఒక ప్యాకేజీ, చిలకలూరిపేట నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వరకు మరో ప్యాకేజీగా విభజించారు. తొలి ప్యాకేజీ కింద బాపట్ల జిల్లాలో పనులు మొదలై జరుగుతున్నాయి. కానీ రెండో ప్యాకేజి నరసరావుపేట బైపాస్‌కు సంబంధించి 70 హెక్టార్ల భూసేకరణలో జాప్యం కారణంగా పనులు మొదలుపెట్టలేదు.

ఇరుకు రహదారిలో నిత్యం ప్రమాదాలు: గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇరుకు రోడ్డులో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిలకలూరిపేట- నరసరావుపేట మధ్య 20 కిలోమీటర్ల పరిధిలో సమస్య ఎక్కువగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రహదారిని కొన్నిచోట్ల విస్తరించి మరికొన్నిచోట్ల వదిలెయ్యడం వల్ల కొత్తగా ఈ రోడ్డులోకి వచ్చేవారు అయోమయానికి గురవుతున్నారు. వేగంగా దూసుకువచ్చి వంతెనలు, కల్వర్టుల వద్దకు వచ్చేసరికి అవగాహన లేక బోల్తా కొట్టిస్తున్నారు. భారీ వాహనాలు ఢీకొన్ని ద్విచక్ర వాహనదారులు చనిపోతున్నారు. వీలైనంత త్వరగా రహదారి విస్తరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

గంటకు 120కిలో మీటర్ల వేగం-బ్రేక్‌ పై కాలు వేయకుండా చెన్నై బెంగళూరులకు రయ్‌..రయ్ - Bangalore Chennai Express way

పల్నాడు జిల్లాలో రహదారి విస్తరణకు అవసరమైన భూమి ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. భూముల విలువ ఎక్కువగా ఉండటంతో అక్కడి రైతులు పరిహారం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. భూసేకరణ సహా రోడ్డు నిర్మాణానికి మొత్తం నిధులు కేంద్రమే ఇస్తున్నా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం రైతులతో చర్చించలేదు. అందువల్ల ఈ రహదారి నిర్మాణ పనులు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. హైదరాబాద్​ను సముద్రతీర ప్రాంతాలకు అనుసంధానం చేయడంలో ఈ మార్గం ఎంతో కీలకమైంది. చెన్నై నుంచి తెలంగాణ వైపు వెళ్లే వారికి ఇది దగ్గరి దారి అవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా భూసేకరణ సమస్యను పరిష్కరించి రహదారిని విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు.

అమరావతి ఐఆర్‌ఆర్​పై ప్రభుత్వం ఫోకస్​ - త్వరగా పట్టాలెక్కించేందుకు కసరత్తు - Amaravati Inner ring Road

రహదారి విస్తరణ పనుల్లో జాప్యం - కేంద్రం నిధులు ఇస్తామన్నా పట్టించుకోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.