Road Accident in Adilabad : ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో రహదారులు రక్తమోడాయి. సోమవారం అర్ధరాత్రి జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. వివరాల్లోకెళ్తె ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి సమీపంలో జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కారులో ప్రయాణిస్తున్న ఆదిలాబాద్‌కు చెందిన మోయిజ్ (60), అలీ (8), ఖాజా మోయినుద్దీన్ (40), మహ్మద్ ఉస్మానుద్దీన్ (10) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. బాధితులంతా ఆదిలాబాద్ టీచర్స్‌కాలనీకి చెందినవారిగా గుర్తించారు. భైంసా నుంచి ఆదిలాబాద్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Road Accident in Nalgonda : మరో ఘటనలో నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. త్రిపురారం మండలం గుంటిపల్లి అన్నారం గ్రామానికి చెందిన మల్లికంటి దినేశ్ (22) కొత్త కారు కొనేందుకని తన స్నేహితులు వేములపల్లి మండలం మొలకపట్నం గ్రామానికి చెందిన వలపుదాసు వంశీ (22), మాడ్గులపల్లి మండలం ఆగమోత్కూర్ గ్రామానికి చెందిన అభిరాళ్ల శ్రీకాంత్ (21)తో కలిసి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి వెళ్లారు. అక్కడ కొంత డబ్బు చెల్లించి ద్విచక్రవాహనంపై స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా, చిలుకూరు మండలంలోని మిట్స్ కళాశాల వద్ద లారీని ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఎవరో తెలిసినా ఫిర్యాదు చేయట్లేదు - బాధితుల మౌనమే నేరాలకు దన్ను - People not Giving Complaints