Road Accident in Suryapet Today : సూర్యాపేటలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత వారం వ్యవధిలోనే ఈ ప్రాంత సమీపవాసులు 14 మందిని రోడ్డు ప్రమాదాలు(Road Accidents in Telangana) బలిగొన్నాయి. తాజాగా సూర్యాపేట-ఖమ్మం క్రాస్ రోడ్డు ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మరికొద్ది రోజుల్లో న్యూజిలాండ్ వెళ్లాల్సి ఉన్న నవీద్ అనే యువకుడు స్నేహితులకు రంజాన్ పర్వదినం సందర్భంగా విందును ఏర్పాటు చేశాడు. పార్టీ ముగించుకుని వస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా సూర్యాపేట-ఖమ్మం ఫ్లైఓవర్‌పై వెళుతున్న డీసీఎంను వెనకనుంచి వారి కారు బలంగా ఢీ (Car Hits a Van in Suryapet) కొట్టింది. ఆ సమయంలో కారులో నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. ఇందులో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.
సుక్క పడిందంటే ప్రతి ఒక్కడూ రైడరే.. రోడ్డెక్కి ఏ బండికో గుద్దుడు ఖాయమే.. ఏం చేసేది మరి?
Three People Died in Suryapet Road Accident : వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును పరిశీలించారు. సహాయక చర్యల్లో భాగంగా పూర్తిగా దెబ్బతిన్న కారులో ఇరుక్కున్న మృతదేహాలను క్రేన్ సహాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీసులు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చనిపోయిన ముగ్గురు యువకులు(Three People Died) సూర్యాపేటకు చెందిన నిఖిల్ రెడ్డి, నవీద్, రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతి వేగమే ప్రమాదానికి (Suryapet Road Accident Today) కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అందుకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టిన కారు - అక్కడికక్కడే ఇద్దరు మృతి