ETV Bharat / state

అప్పటి వరకూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి అంతలోనే తిరిగిరాని లోకాలకు - ROAD ACCIDENT IN AP ANANTAPUR DIST

ఏపీలోని అనంతరపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - భార్య సీమంతం అనంతరం ఇంటికి వెళ్తుండగా ఘటన

Road Accident in Anantapur Dist
Road Accident in Anantapur Dist (ETv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2024, 7:30 PM IST

Road Accident in Anantapur Dist : 'మమ్మల్ని బస్సెక్కించి బైకుపై వస్తానంటూ పాడెక్కావా భాస్కరా అంటూ బాధిత కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా చేసిన రోదన స్థానికులకు సైతం కంటతడి పెట్టించింది. ఈ హృదయవిదారక ఘటన ఆంధ్రప్రదేశ్​లోని సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. కదిరి మండలం పట్నం ప్రాంతం వద్ద జాతీయ రహదారి 42పై లారీ - బైక్​ ఢీ కొన్న ప్రమాదంలో భాస్కర్‌ (24) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

అప్పటి వరకూ కుటుంబ సభ్యులతో ఆనందంగా : ఏపీలోని కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన భాస్కర్‌ అనే వ్యక్తి పొట్టకూటి కోసం అనంతపురం వెళ్లారు. కొంతకాలంగా అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. వృత్తి రీత్యా పాల వ్యాను డ్రైవర్‌గా పనిచేసే అతను భార్య సీమంతం కోసం స్వగ్రామమైన పట్నానికి శనివారం (అక్టోబర్​ 12న) వెళ్లారు. ఆదివారం బంధువులు, ఫ్రెండ్స్​తో కలిసి సీమంతం వేడుకల్లో ఆనందంగా గడిపాడు. భార్య, కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే సాయంత్రం తాను ద్విచక్ర వాహనంపై వస్తానని తల్లిదండ్రులు, భార్య లక్ష్మిని సోమవారం ఉదయం అనంతపురం బస్సు ఎక్కించారు.

బయలుదేరిన కొద్ది సేపట్లోనే ఘోర ప్రమాదం : భాస్కర్ సొంతూరులో వ్యక్తిగత పనులు ముగించుకుని బైక్​పై అనంతపురానికి బయలుదేరాడు. ఇంతలోనే హంద్రీనీవాకాలువ మోరీ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల ద్వారా సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని కదిరి ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు కదిరి ఆసుపత్రికి చేరుకున్నారు.

గుండెలు పగిలేలా రోదన : భార్య సీమంతం కార్యక్రమంలో కుటుంబసభ్యులు, బంధువులతో అప్పటివరకూ ఆనందంగా గడిపిన భాస్కర్ మృతిచెందడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. అందివచ్చిన వచ్చిన కుమారుడు, తన భర్త ఇకలేడని తెలుసుకున్న అతడి భార్య లక్ష్మి గుండెలు పగిలేలా రోదించారు. ఈ సంఘటన అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు కదిరి సీఐ మోహన్​ తెలిపారు.

బర్త్​డే వేడుకలకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు ఏపీవాసులు దుర్మరణం - Road Accident in Anantapur District

మాదాపూర్​లో రోడ్డు ప్రమాదం - ఎలక్ట్రిక్ బస్సు ఢీకొని యువతి మృతి - Road Accident In Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.