Rice Planter Battery Machine : ఔరా అనిపించాలంటే అద్భుతం చేయాల్సిందే, అద్భుతం చేయాలంటే ఆవిష్కరణలు రూపొందించాల్సిందే, ఆవిష్కరణలు రూపొందించాలంటే ఆలోచనలకు పదును పెట్టాల్సిందే మీరు, నేను మాట్లడుకోవడం కాదండి. నేటి యువతరంలోని అంతరంగమిది. అలాంటి యువతను చైతన్య పరిచేందుకు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, నాబార్డు సహకారంతో 'వన్ డిస్ట్రిక్ట్- వన్ ఎగ్జిబిషన్(One District One Exhibition)' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వ్యవసాయ రంగం కోసం తయారు చేసిన ఆవిష్కరణలను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 30 మంది ఆవిష్కర్తలు తమ ప్రాజెక్టుల విశేషాలను సందర్శకులకు వివరించారు.
అథ్లెటిక్ కోచ్‌గా ఆదిలాబాద్ అడవి బిడ్డ - గిరిజన విద్యార్థులకు శిక్షణ
One District One Exhibition Nizamabad : కామారెడ్డి జిల్లాకు చెందిన నాగస్వామి బ్యాటరీతో పనిచేసే వరి నాటు యంత్రాన్ని తయారు చేశాడు. కరోనా కాలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, దీనిని రూపొందించానని చెబుతున్నాడు. రెండు గంటలు ఛార్జ్ చేస్తే రోజంతా నాటు వేస్తుందని వివరించాడు. ఈ పరికరం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు.
మరోవైపు పాఠశాలల్లో వంట చేసే వారి కోసం 'మహిళ వంటమిత్ర ప్రాజెక్టు(Mahila Vanta Mithra Project)'ను ఓ విద్యార్థిని తయారు చేసింది. తన ప్రాజెక్టు ద్వారా సులభంగా వంట చేయవచ్చని తెలిపింది. మెకానికల్ కంట్రోల్ టర్న్ వాల్వ్ సిస్టమ్‌ను రాజాసింగ్ తయారు చేశాడు. ఈ యంత్రం ద్వారా ఒక మడి నుంచి ఇంకో మడికి రైతు లేకుండానే నీళ్లు మళ్లిస్తుంది. విద్యుత్, బ్యాటరిలతో పని లేకుండా బోరు నుంచి వచ్చే నీళ్లు ఆటోమేటిక్‌గా వేరే మడికి పారించవచ్చంటున్నాడు దీని రూపకర్త రాజాసింగ్.
'ఇంజినీర్లు, డాక్టర్లు చాలా ఉన్నారులే నాన్న - నేను కళారంగం వైపు అడుగేస్తా'
"నేను మహిళ వంటమిత్ర ప్రాజెక్ట్‌ను రూపొందించాను. సాధారణంగా పాఠశాలల్లో వంట చేసే వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. వీరు ప్రతి రోజు 50 కిలోల నుంచి 100 కిలోల బియ్యం వండుతారు. వండేటప్పుడు గంజి పారేయడానికి చాలా ఇబ్బందులు పడతారు. దీని కోసం ఈ యంత్రాన్ని తయారు చేశాను. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇది వంట చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది."- వినీల, మహిళ వంటమిత్ర రూపకర్త
Multipurpose Walking Stick : ఓ విద్యార్థి రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు మల్టీపర్పస్ వాకింగ్ స్టిక్‌ను రూపొందించాడు. ఈ స్టిక్‌ను రాత్రి పూట టార్చి లైట్‌గా కూడా వాడుకోవచ్చని చెబుతున్నాడు. మొక్కజొన్న కంకులు కాల్చే చిరు వ్యాపారులకు తన పరికరం ఎంతో ఉపయోగకరమని కార్న్పస్ బ్రోస్టింగ్ మెషీన్(Cornpus Broasting Machine) రూపకర్త కృతిక వివరించింది. సోలార్ ప్యానెల్‌తో తయారు చేసిన ఈ ప్రాజెక్టు సూర్యరశ్మి లేకున్నాబ్యాటరీతో నడిచేలా రూపొందించానని చెబుతోంది. వినూత్నంగా ఆలోచించి రూపొందించిన ప్రాజెక్టులకు మంచి ఆదరణ లభింస్తోందని ఔత్సాహికులు తెలిపారు. ఆవిష్కరణలను మార్కెట్‌లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని అంటున్నారు.
డిగ్రీలు పూర్తి చేసి - సహజ సిద్దమైన వంట నూనె తయారీ వ్యాపారంలో రాణిస్తున్న ముగ్గురు మిత్రులు
20 సినిమాల్లో 50 పాటలు - ఈ యువ రచయిత సక్సెస్ స్టోరీ తెర వెనక కష్టాలు తెలుసుకోవాల్సిందే