ETV Bharat / state

పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్ - నిర్మించుకున్న ఆ ఇళ్ల రెగ్యులరైజ్‌కు ఓకే - SIMHACHALAM LAND ISSUE

త్వరలో సింహాచలం పంచగ్రామాల సమస్యకు పరిష్కరం - 610 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,149 ఇళ్లను రెగ్యులరైజ్‌ చేయనున్న ప్రభుత్వం - ఆయా భూముల రిజిస్ట్రేషన్ విలువ రూ.5,300 కోట్లు

Revenue Minister Anagani Satya Prasad On Simhachalam Land issue
Revenue Minister Anagani Satya Prasad On Simhachalam Land issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 5:28 PM IST

Revenue Minister Anagani Satya Prasad On Simhachalam Land issue : సింహాచలం పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు రూ.5,300 కోట్ల విలువైన భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. మొత్తం 12,149 ఇళ్లను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కూడా అంగీకారం తెలిపారని చెప్పారు. 2016-17 ధరలకే 70 వేల మందికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆ తేదీల నుంచే క్రమబద్ధీకరణ వర్తించేలా సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు.

అలాగే గాజువాకకు సంబంధించిన భూముల క్రమబద్ధీకరణకు కూడా సీఎం నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత, భరోసా వచ్చిందన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు, ఎంపీ శ్రీభరత్‌ మీడియాతో మాట్లాడారు.

రిజిస్ట్రేషన్ విలువ రూ. 5,300 కోట్లు : అనంతరం గాజువాక ఎమ్మెల్యేల పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖలో దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని స్పష్టం చేశారు. సింహాచలం భూములను ఆక్రమించి 12,149 ఇళ్లను నిర్మించుకున్నారని, వాటిని క్రమబద్ధీకరణకు ప్రయత్నం గతంలోనూ చేశామని పల్లా తెలిపారు. ఇప్పుడు సీఎం నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాల భూములు సింహాచల దేవస్థానానికి బదలాయిస్తున్నట్లు వెల్లడించారు. దీని రిజిస్ట్రేషన్ విలువ రూ. 5,300 కోట్ల వరకు ఉందన్నారు. రెండు మూడు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుందని వివరించారు.

పెదగంట్యడ, గాజువాక తదితర ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానానికి 610 ఎకరాల భూమి ఇస్తున్నట్లు పల్లా చెప్పారు. దేవస్థానం చందనం చెట్లను పెంచుకునేందుకు అవకాశం ఉన్న చోట్ల భూమి ఇస్తున్నామన్నారు. గాజువాకలో ఇనాం భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకూ సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. 299, 386 జీవోల మేరకు గతంలో పట్టాలు ఇచ్చామని కానీ గత ప్రభుత్వం సంపూర్ణ హక్కులు కల్పించలేదని విమర్శించారు. ఆ పట్టాలు అన్నిటి పైనా పూర్తి హక్కులు వచ్చేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు.

సింహాచలం భూ అక్రమాల విచారణ వేగవంతం

సింహాచలంలో ఏం జరుగుతుందో!- చౌక ధరకే నెయ్యి సరఫరా- సీజ్ చేసిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.