ETV Bharat / state

వ్యాపారానికి పట్టణమే అవసరం లేదు - మంచి ఆలోచన ఉంటే చాలంటున్న యువతి - Eco Friendly Bags - ECO FRIENDLY BAGS

Revathi Making Nature Friendly Bags in Srikakulam District : ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్నవయసులోనే వివాహం చేసుకుందా యువతి. ఇంట్లో ఖాళీగా ఉండేకంటే ఏదైనా వ్యాపారం చేస్తే మేలనుకుంది. పర్యావరణహితంగా ఆలోచించి నాన్ ఓవెన్ బ్యాగ్స్ తయారీ ప్రారంభించింది. ప్రజలకు, వ్యాపార సంస్థలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసి ఆర్డర్లు అందుకుంది. ఫలితంగా నేడు మరో పది మందికి ఉపాధి కల్పిస్తోన్న శ్రీకాకుళానికి చెందిన రేవతి విజయగాథ ఇది.

ECO FRIENDLY BAGS
ECO FRIENDLY BAGS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2024, 2:28 PM IST

Revathi Making Nature Friendly Bags in Srikakulam District : వ్యాపారం చేయాలంటే పట్టణానికే వెళ్లాల్సిన అవసరం లేదు. ఓ మంచి ఆలోచన ఉంటే ఉన్న ఊరిలోనే నచ్చిన రంగంలో రాణించొచ్చని నిరూపించింది శ్రీకాకుళానికి చెందిన రేవతి. తన కొచ్చిన పర్యావరణహిత ఆలోచనకు భర్త ప్రోత్సాహం తోడవ్వడంతో నాన్ ఓవెన్ బ్యాగ్స్ వ్యాపారంలో రాణిస్తోంది. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టి ఇప్పుడు తనలాంటి ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది ఈ ఔత్సాహికురాలు.

కుటీర పరిశ్రమతో లాభాలు : శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వెంకటాపురంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో రేవతి జన్మించింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా 19 ఏళ్లకే వివాహం జరిగిపోయింది. దాంతో ఉన్నత చదువులు చదివి కెరీర్‌లో రాణించాలనే తన లక్ష్యం కలగానే మిగిలిపోయింది. అత్తవారింట్లో గృహిణిగా ఉంటూనే భర్త అప్పలనాయుడుకి వ్యవసాయంలో తోడ్పాటు అందించింది.

ఐడియా అదుర్స్​ - హైడ్రోజన్‌తో నడిచే హైబ్రిడ్​ స్కూటీ ఆవిష్కరణ - Hybrid Bike Runs with Hydrogen

ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్‌ ఆలోచన : ఖాళీగా ఇంట్లో ఉండేకంటే ఏదైనా చేస్తే బాగుంటుదని రేవతి ఆలోచన చేసింది. పొలంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లు చూసి చలించింది. ప్రభుత్వాలు అవగాహన కల్పించినా మార్పు రావడం లేదని తన వంతు ప్రయత్నం చేద్దామని ముందుకు కదిలింది. ఎన్నో ఆలోచనల తర్వాత తనే పర్యావరణహిత బ్యాగులు తయారు చేయాలని సంకల్పించుకుంది. ఇందుకు భర్త ప్రోత్సాహం తోడవ్వడంతో పర్యావరణహిత బ్యాగులు తయారీ విధానం తెలుసుకునే పనిలో నిమగ్నమైంది. తన అన్వేషణలో నాన్ ఓవెన్ బ్యాగ్స్ తయారీ పరిశ్రమ విజయవాడలో ఉందని తెలుసుకుంది. అక్కడికి వెళ్లి పరిశీలించింది. సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో ఎక్కువ సంచులు తయారు చేయడం గమనించింది. అక్కడే కొన్ని రోజులు పాటు శిక్షణ పొందింది.

పెళ్లి అయినా తర్వాత నాకు ఏదో ఒకటి చేయాలని ఆలోచన ఉండేది. అప్పుడే ప్రభుత్వం ప్లాస్టిక్​ బ్యాగ్​ను బ్యాన్​ చేసింది. అప్పడే నాకు నాన్ ఓవెన్ బ్యాగ్స్ తయారీ చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్నే నా భర్తకు చెప్పాను. తాను నన్ను ఎంతో ప్రోత్సాహించాడు. ఇలాంటి పరిశ్రమ విజయవాడలో ఉందని తెలుసుకొని అక్కడకు వెళ్లి శిక్షణ తీసుకున్నాను. తర్వాత కొన్ని బ్యాగ్స్​ను తయారు చేసి చుట్టూ ప్రక్కల వారికి, హాస్పిటల్​, షాపింగ్​ మాల్స్​కు శాంపుల్స్​ తీసుకువెళ్లాను. ఉత్పత్తిని పెంచడానికి రూ.10 లక్షలు అప్పు చేసి కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఇక్కడ 20 మంది మహిళల దాకా పనిచేస్తున్నారు- రేవతి, వ్యాపారవేత్త

అప్పు చేసి కుటీర పరిశ్రమ ఏర్పాటు : వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని సొంతూర్లో కుటీర పరిశ్రమ పెట్టాలని సన్నాహాలు చేసింది రేవతి. నమూనాకు కొన్ని నాన్ ఓవెన్ బ్యాగ్స్ తయారీ చేసి ప్రజలకు, వ్యాపారులకు పంపిణీ చేసింది. ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం వల్ల కలిగే నష్టాలపైనా వివరించింది. తన ఆలోచనకు మంచి రివ్యూలు రావడంతో 10 లక్షలు అప్పు చేసి మరీ కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసింది. నాన్ ఓవెన్ బ్యాగ్స్ తయారీకి కావాల్సిన ముడి సరుకులను హైదరాబాద్, చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటోంది రేవతి. ఇందుకు భర్త సాయం చేస్తున్నాడు. వ్యాపారస్థులు, వినియోగదారులు ఆర్డర్లకు తగ్గట్టు బ్యాగ్స్ తయారు చేస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖ, రాజమహేంద్రవరం, విజయనగరం, ఒడిశాలోని పలు నగరాల్లోకి ప్రతి రోజూ వేలల్లో సంచులు ఎగుమతులు చేస్తూ లాభాలను ఆర్జిస్తుంది.

ఎలక్ట్రికల్ వాహనా​లలో బ్యాటరీ పేలుళ్లకు చెక్ - సరికొత్త ఏఐ ఈ-బైక్ తయారుచేసిన విట్​ విద్యార్థులు - E Bike Designed by Prayana Startup

మహిళాసాధికారతకు కృషి : రేవతి ఆలోచనను ప్రోత్సాహించి ముందుండి నడిపించాడు భర్త అప్పలనాయుడు. ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తూనే భార్య వ్యాపార ఎగుమతులను చూసుకుంటున్నాడు. రేవతి ఆలోచన వల్ల సొంతూర్లోనే తమకు ఉపాధి దొరికిందని మహిళలు చెబుతున్నారు. పర్యావరణహిత వ్యాపార ఆలోచన సక్సెస్‌ అవ్వడంతో మరో 20 మంది మహిళలకు సొంతూర్లోనే ఉపాధి అవకాశాలు కల్పించింది. తద్వారా మహిళాసాధికారతకు కృషి చేస్తోంది. వ్యాపారంలో లాభాలు ఆర్జించడం ప్రధానం కాదని, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి పర్యావరణహిత సంచులనే వాడాలంటూ అందరికి రేవతి పిలుపునిస్తుంది.

ఒలింపిక్స్​లో పతకమే లక్ష్యం- సదుపాయాలు లేకున్నా సాఫ్ట్‌బాల్‌లో సత్తా - SRIKAKULAM YOUTH IN SOFTBALL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.