Revanth Reddy and Team Dubai Tour : మూసీ అభివృద్ది ప్రణాళికలపై అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం దుబాయ్ వెళ్లింది. మూసీ అభివృద్ధి కోసం లండన్‌లోని థేమ్స్ నదిని అధ్యయనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం, దుబాయ్‌లో నిపుణులతో చర్చించింది. సుమారు 54 కిలోమీటర్ల మూసీ పరీవాహకం అభివృద్ధి, సుందరీకరణతో పాటు వాణిజ్య అవకాశాలపై చర్చించారు.
బీఆర్ఎస్ను 100 మీటర్ల బొంద తీసి పాతిపెడతా - సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Revanth Reddy on Musi River Development Discussion : పట్టణాభివృద్ధి, మాస్టర్ ప్లాన్, సిటీ స్పేస్ అభివృద్ధిలో అనుభవమున్న సుమారు 70 గ్లోబల్ సంస్థలతో సీఎం రేవంత్ బృందం చర్చించింది. ఆయా సంస్థలు వివిధ దేశాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించాయి. పలు ప్రముఖ సంస్థలు మూసీ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తిని కనబరిచాయి. అవసరమైతే హైదరాబాద్ వచ్చి మూసీ పరిసరాలు పరిశీలించి తదుపరి చర్చలు చేపడతామని తెలిపాయి. ఈ అర్ధరాత్రి వరకు వివిధ సంస్థలతో సీఎం బృందం చర్చలు కొనసాగనున్నాయి. సమావేశాల తర్వాత దుబాయ్(CM Revanth Dubai Tour) నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్‌కు బయలుదేరనుంది. ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి, దాన కిషోర్, ఆమ్రపాలి ఈ చర్చల్లో పాల్గొన్నారు.
అదానీతో రేవంత్ రెడ్డి దిల్లీలో కుస్తీ, దావోస్‌లో దోస్తీ : దాసోజ్ శ్రవణ్
CM Revanth Reddy London Tour : మూడు రోజుల లండన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు స్మారక కేంద్రాలను సందర్శించారు. లండన్‌లో ప్రపంచ ప్రసిద్ధమైన చారిత్రక కట్టడాలనూ, స్మారక కేంద్రాలను ఆయన సందర్శించారు. బిగ్‌బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ ఎట్ ఆల్ కట్టడాలను సీఎం రేవంత్ రెడ్డి తిలకించారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను సీఎం అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో లండన్‌లో అనుసరిస్తున్న విధానాలను సీఎం అధ్యయనం చేశారు. మూసీ నది అభివృద్ధి కోసం లండన్‌లోని థేమ్స్ నదిని పరిశీలించారు. అనంతరం లండన్ అధికారుల టీమ్‌తో చర్చించారు. భవిష్యత్‌లో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
నేనూ రైతు బిడ్డనే వ్యవసాయం మా సంస్కృతి - దావోస్‌లో సీఎం రేవంత్ ప్రసంగం
రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేదే నా స్వప్నం: సీఎం రేవంత్