ETV Bharat / state

కకావికలమైన మున్నేరు ప్రభావిత ప్రాంతాలు - ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు - Rescue Operation in Khammam

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 9:52 PM IST

Updated : Sep 4, 2024, 10:29 PM IST

Rescue Operation for Flood Victims : మున్నేరు విలయంతో కకావికలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని సర్కారు ముమ్మరం చేసింది. వరదల నుంచి తేరుకుంటున్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా యంత్రాంగాన్ని మోహరించింది. ప్రభావితమైన పది డివిజన్లలో ఒక్కోదానికి ప్రత్యేకాధికారిని కేటాయించింది. పారిశుధ్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్తు పునరుద్ధరణ, తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వీలైనంత త్వరగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేలా యంత్రాంగమంతా కార్య రంగంలోకి దిగింది.

Rescue Operation for Munneru Flood Victims
Rescue Operation for Flood Victims (ETV Bharat)

Rescue Operation for Munneru Flood Victims : మున్నేరు వరద విలయంతో ఖమ్మంలోని 10 డివిజన్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటున్న వేళ అక్కడ సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా మోహరించింది. ధంసలాపురం కాలనీ, కొత్తూరు, శ్రీనివాసనగర్, ప్రకాశ్ నగర్, రాజేంద్రనగర్, పంపింగ్ వెల్ రోడ్డు, రంగనాయకులగుట్ట, మోతీనగర్, ట్రంక్ రోడ్డు, వెంకటేశ్వరనగర్, బొక్కల గడ్డ, గణేశ్ నగర్, పద్మావతి నగర్, దానవాయిగూడెం, రామన్నపేట కాలనీలకు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు.

బాధితుల కోసం నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 4 వేల 500 మంది తలదాచుకున్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో వరద బాధితులకు వస్త్రాలు పంపిణీ చేసేందుకు 10 వేల కిట్లు తయారు చేయించి అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా పారిశుధ్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ప్రత్యేకాధికారిగా ఐటీడీఏ పీవో రాహుల్‌ను నియమించారు. ఖమ్మంలో వరద సహాయక చర్యలు, పునరుద్ధరణ చర్యల పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి గౌతమ్‌కు బాధ్యతలు అప్పగించారు.

'వరదకు పూర్తిగా దెబ్బతిన్న 10 డివిజన్​లో సహాయక చర్యలు చేపట్టాం. వరదకు ఇళ్లలో బురద వచ్చి ఇంట్లోని సమన్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వీధుల్ని శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లడం వంటి పనులు చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే సాధారణ పరిస్థితులు తెచ్చేలా చర్యలు చేపడుతున్నాం'- తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి

వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా : బురద మేటలు వేసిన ప్రాంతాలు, కాలనీల్లో పారిశుద్ధ్య పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారు. కాలనీల వారీగా వాహనాలు ఏర్పాటు చేసి చెత్త సేకరిస్తున్నారు. వీధుల్ని శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లడం వంటి పనులు చేస్తున్నారు. 600 మంది కార్మికులు విధుల్లో నిమగ్నమయ్యారు. వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ రంగంలోకి దిగింది. వైద్యారోగ్య శాఖ కమిషనర్, ఐఏఎస్ ఆర్వీ కర్ణన్‌ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. 12 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పెట్టారు.

ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే చేపట్టాయి. మూడ్రోజులుగా అంధకారంలోనే మగ్గుతున్న వరద ప్రభావిత కాలనీల్లో ఇప్పుడిప్పుడే విద్యుత్తు పునరుద్ధరణ జరుగుతోంది. ఇందుకోసం నగరంలో మొత్తం 34 బృందాలు పనిచేస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో వీలైనంత త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేస్తామని అధికారులు భరోసా కల్పిస్తున్నారు.

ఎవరిని కదిపినా ఒకటే వ్యథ - ముంపు బాధితులందరిదీ అదే కన్నీటి గాథ - MUNNERU FLOOD VICTIMS PROBLEMS

మున్నేరు శాంతించినా కన్నీరే మిగిలింది - నీట మునిగిన ఇంట్లో బురదతో బాధితుల ఇబ్బందులు - Munneru Flood Effect

Last Updated : Sep 4, 2024, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.