ETV Bharat / state

వ్యవసాయ భూమిలో రాళ్లున్న రైతులకు ఇక ఉపశమనమే! - అందుబాటులోకి మెషిన్​ - Good News For Formers

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 5:11 PM IST

Stone Removal Machine: మీ పొలంలో రాళ్లు ఉన్నాయా. ఇక చింతించకండి. ఎలాంటి రాళ్ల నేలనైనా చక్కగా సాగు భూమిగా మార్చే యంత్రం ఒకటి రైతులకు అందుబాటులోకి వచ్చింది. కూలీలతో రోజుల తరబడి ఉన్న పలుగు రాళ్లను ఏరించినా సాగుకు అంత అనుకూలంగా ఉండని నేలలో ఈ యంత్రం ద్వారా రాళ్లు ఏరిస్తే గంటల్లో సాగుకు తయారవుతుంది. ఇంతకీ ఆ యంత్రం ఏమిటో? దాన్ని ఎవరూ? అందుబాటులోకి తెచ్చారో తెలుసుకుందామా?

Available in Andhra Pradesh
Stone Removal Machine (ETV bharat)

Stone Removal Machine: సాధారణంగా పంటలో కలుపు మొక్కలు ఉంటే కూలీలతో సాయంతో తొలగిస్తాం. మరీ రాళ్లూ రప్పలతో ఉన్న సాగుకు ఉపయోగపడని భూమి ఉంటే ఏం చేస్తాం? ఖాళీగా వదిలేస్తాం. మహా అయితే పైపైన రాళ్లను కూలీలతో తొలగించి, పరిమితమైన విస్తీర్ణంలోనే పంటను వేస్తాం. కానీ ఇప్పుడా బాధ లేదు. రాళ్ల నేలలను చక్కగా సాగుభూమిగా మార్చే యంత్రం ఒకటి రైతులకు అందుబాటులోకి వచ్చింది. కూలీలతో రోజుల తరబడి రాళ్లు ఏరించినా సాగుకు త్వరగా అనుకూలంగా మారని నేలను, ఈ యంత్రం ద్వారా రాళ్లు ఏరిస్తే గంటల్లో సాగుకు తయారవుతుంది. ఇది ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ రైతుకు తట్టిన ఆలోచన. మధ్యప్రదేశ్‌లో ఆ మిషన్​ని తయారు చేయగా వారి నుంచి కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు అందుబాటులోకి తెచ్చారు.

భూమిని ఖాళీగా వదిలేయాల్సిన పని లేదు: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాల భూమి సాగుకు పనికి రాకుండా వృథాగా ఉంది. దానికి కారణం భూమి మొత్తం రాళ్లతో నిండి ఉండటం. దానిని సాగులోకి తీసుకురావాలంటే ఈ రాళ్లను మనుషులతో ఏరిస్తుంటారు. దీనికి ఖర్చు కూడా ఎక్కువే. అంత ఖర్చు పెట్టినా అంతంత మాత్రంగానే రాళ్లను తొలగించగలరు. ఒకవేళా పంట వేస్తే మొక్కల వేర్లు భూమిలోపలికి చొచ్చుకొని పోకపోవడం వల్ల మొక్క ఎదుగుదల ఉండదు. అందువల్ల భూమి ఉన్నా, రాళ్లతో ఉండటం వల్ల చాలా మంది రైతులు ఆ నేలలను వృథాగా వదిలేస్తారు. దీంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవులను తలపిస్తాయి.

నేనూ రైతునే - భావోద్వేగానికి గురైన అన్నదాతను హత్తుకొని ఓదార్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌ - Union Minister Shivraj on Floods

ఆలోచన కార్యరూపం దాలిస్తే ఇలానే మరి! : పశ్చిమ ప్రకాశం అయిన కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండ ప్రాంతంలో ఇలాంటి రాళ్ల నేలలు అధికంగా కనిపిస్తాయి. ఈ సమస్యను స్వయంగా చూసిన కొమరోలుకు చెందిన రంగస్వామి, అతని సోదరుడు మల్లిఖార్జునరావులు రాళ్లు ఏరేందుకు ఏదైనా యంత్రం ఉందేమోనని పరిశోధించారు. చివరికి మధ్యప్రదేశ్​​లో దీన్ని తయారు చేస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లీ కావాల్సివ విధంగా యంత్రాన్ని తయారు చేయించి తెచ్చుకున్నారు.

"మేము మధ్యప్రదేశ్ నుంచి ఈ యంత్రాన్ని తీసుకువచ్చాం. దీని ఖర్చు రూ.10 లక్షల 40 వేలు అయ్యింది. రైతులు కూలీలను పెట్టి రాళ్లను ఏరిస్తుంటే దానికి ప్రత్యామ్నయ మార్గాన్ని కనుక్కోవాలనే ఆలోచన వచ్చింది. ఈ యంత్రం అందుబాటులోకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా పొలాలు ఉన్నప్పటికీ ఈ రాళ్లు ఏరే యంత్రం ద్వారా సాగునేలను అభివృద్ధి చేయడంతో చెప్పలేనంత హాయిగా ఉంది. గంటకు దాదాపు రూ.2,700/- కిరాయి వసూలు చేస్తున్నాం. ఇలాంటి యంత్రాలు మరిన్ని అందుబాటులోకి వస్తే, మా జిల్లాలో సాగునేల విస్తీర్ణం భారీగా పెరుగుతుంది." - రంగస్వామి, యంత్రం నిర్వాహకుడు

ఈ యంత్రం అందుబాటులోకి రావడంతో తమ పొలాలు ఇక సాగుకు పనికి వస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటలు సాగు చేయాలనే ఆలోచనతో ఉప్పోంగిపోతున్నారు.

రైతులు, విద్యార్థులే మా ప్రాధాన్యత - త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాల భర్తీ : రేవంత్​ రెడ్డి - CM Revanth comments on recruitment

రైతు రుణమాఫీ అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: ధర్మపురి అర్వింద్ - MP ARVIND FIRES ON CONGRESS GOVT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.