Regional Ring Road Importance Today Prathidhwani : హైదరాబాద్ మహానగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర విస్తృతాభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది ప్రాంతీయ వలయ రహదారి(ఆర్ఆర్ఆర్). ప్రాథమికంగా రవాణామార్గంగా కనిపించే ఈ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తైతే నివాసప్రాంతాలు, వ్యాపార కేంద్రాలతోపాటు పరిశ్రమలు, పర్యావరణ హిత కార్యకలాపాలకు నిలయంగా మారనుంది.
రాష్ట్రంలో నగరాలకు, గ్రామాలకు మధ్య అంతరాన్ని సమూలంగా మార్చేసే సాధనంగా త్రిపుల్ ఆర్ నిలుస్తుందన్న అంచనాలున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తరార్ధభాగం నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో ప్రాంతీయ రహదారికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో మహర్దశ పట్టే రంగాలు ఏవి? రీజినల్ రింగ్ రోడ్డు సకాలంలో పూర్తికావాలంటే ప్రభుత్వ ప్రణాళికలు ఎలా ఉండాలి? ఇదే నేటి ప్రతిధ్వని.