ETV Bharat / state

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం - ఒక్కరోజులోనే ఎంత వర్షపాతమో తెలుసా? - record rainfall in krishna district - RECORD RAINFALL IN KRISHNA DISTRICT

Heavy Rain in Krishna District : భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా తడిసిముద్దయింది. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, వీధులు, రహదారులు నీటమునిగాయి. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం ఇప్పుడు చూస్తున్నామని స్థానికులు తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ జలజీవనం స్తంభించింది.

Heavy Rain Lashes Joint Krishna District
Heavy Rain Lashes Joint Krishna District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 5:00 PM IST

Heavy Rain Lashes Joint Krishna District : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలం అయింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై రికార్డును సృష్టించింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో వర్షం నీరు 4 అడుగుల మేర నిలవడంతో ఎటు చూసిన కాలనీలు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ భారీ వర్షాలకు చిగురుటాకులా గజగజ వణికింది. ఏ రోడ్డు, ఓ కాలనీ చూద్దామన్నా వరద నీటితో భయంకర వాతావరణాన్ని సృష్టించింది.

విజయవాడ సిటీలోని ప్రధాన బస్టాండ్​తో పాటు రైల్వేస్టేషన్​ చుట్టూ వరద నీరు చేరింది. అలాగే ఆటోనగర్​ నుంచి బెంజ్​ సర్కిల్​ వరకు రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. మరోవైపు విజయవాడ శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. సింగ్​నగర్​, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్​, కండ్రిగ, రాజీవ్​నగర్​లు పూర్తిగా జలవలయంలో చిక్కుకుని చెరువులను తలపించాయి. విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలు నరకాన్ని చూపించాయి.

బుడమేరు వాగు ఉద్ధృతం : విజయవాడ నగరంలోని బుడమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదనీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో దిగువన ఉన్న కాలనీలు, వీధులు వరదనీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో అనేక మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. అలాగే గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పుట్టగుంట వద్ద వాగు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. వంతెనకు నాలుగు అడుగుల మేరకు ప్రవాహం ఉంది. అధికారుల ఆదేశాలతో గుడివాడ-హనుమాన్​ జంక్షన్​ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసేశారు. అంబాపురంపైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగిపోయాయి.

మహోగ్రరూపం దాల్చుతున్న మున్నేరు : తెలంగాణలో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న గోదావరి ఉపనది మున్నేరు వాగు ఏపీలో అదే రీతిలో ప్రవహిస్తోంది. ఎన్టీఆర్​ జిల్లాలోని పరివాహక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలపై ప్రమాదస్థాయిలో వరద చేరింది. ఎస్సీ కాలనీ, బోస్​పేట జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్​ స్తంభాలు కూలిపోవడంతో అధికారులు విద్యుత్​ను నిలిపివేశారు. అలాగే రహదారులపై గుంతలు పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

కృష్ణా నదికి 1.91 లక్షల క్యూసెక్కుల వరద : నవాబుపేట చెరువుకు గండి పడటంతో వరద ప్రవాహం పెరిగింది. కృష్ణా నదికి 1.90 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. బెల్లంకొండవారిపాలెంలో ఈదురుగాలులకు ఫారాల్లోని కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాతపడ్డాయి. కృష్ణా జిల్లావ్యాప్తంగా పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కృష్ణా ప్రవాహం పెరగడంతో అవనిగడ్డ మండలంలోని పాత హెడ్డంక గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలించారు.

నీట మునిగిన పసుపు, అరటి తోట : అలాగే అముదార్లంక ప్రజలను పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు. మరోవైపు తోట్లవల్లూరు మండలంలో కృష్ణా నది ప్రవాహం పెరగడంతో సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. తోడేళ్లదబ్బ, పొట్టిదిబ్బలంక, పిల్లివానిలంకలో పసుపు, అరటి తోటలు నీటమనిగాయి. లంకగ్రామాల ప్రజల్ని పునరావాసాలకు అధికారులు తరలిస్తున్నారు.

భారీ వరదకు ఇంటికన్నె - కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసం - నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు - Heavy Rain in Mahabubabad

'2018' సీన్​ రిపీట్! - వరద గుప్పెట్లో మణుగూరు - నీట మునిగిన భవనాలు - Heavy Rain in Bhadradri

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.