ETV Bharat / state

పంటనష్టంపై రభస - అధికార, విపక్షాల నడుమ మాటలయుద్ధం - crops damage due to rains in tg

Crops Damage in Telangana : పంటనష్టం అంచనాల పేరుతో జాప్యం చేయకుండా రాష్ట్రప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. పంటలు ఎండుతున్నా, వడగండ్లు ముంచెత్తినా సీఎం కన్నెత్తి చూడటం లేదని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం స్పందించింది. అకాలవర్షాలతో నష్టోపోయిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు.

BRS Demands Compensation to Farmers
Crops Damage in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 20, 2024, 10:11 PM IST

పంటనష్టంపై రభస- అధికార, విపక్షాల నడుమ స్పీచ్‌వార్‌

Crops Damage in Telangana : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులంటే ఎందుకింత చిన్నచూపని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు ముంచెత్తినా సీఎం కన్నెత్తి చూడటం లేదని ఎక్స్‌ వేదికగా విమర్శలు చేశారు. ఎన్నికల గోల తప్ప, పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా అని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలనే ప్రయత్నంలో కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులను ఇబ్బంది పెడుతోందని, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

"పంట నష్టం అంచనాల సాకుతో ఆలస్యం చేయకుండా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. గత ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది". - నిరంజన్‌రెడ్డి, మాజీమంత్రి

BRS Demands Compensation to Farmers : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాగ్ధార్‌పల్లి గ్రామంలో ఎండిన పొలాలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే కాంగ్రెస్‌ సర్కార్‌ కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన(Crops Damage) రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సిరిసిల్ల నియోజకవర్గం పోతుగల్ గ్రామంలో పొలాలను పరిశీలించి, రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున తక్షణ సాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్​కు రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు పట్టవు : హరీశ్​ రావు

Govt Reacts on Crops Damage : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులెవరూ అదైర్య పడొద్దని, ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలతో పంటనష్టం జరిగిందని తెలిపారు. కామారెడ్డిలో అత్యధికంగా నష్టపోయారని తెలిపారు. పంటనష్టం అంచనావేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) సీఎస్‌, వ్యవసాయ ముఖ్య కార్యదర్శులను ఆదేశించారని చిన్నారెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ సిబ్బంది వివరాలు సేకరిస్తారని వెల్లడించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

"అకాల వర్షాలతో నష్టపోయిన రైతులెవరూ అదైర్య పడొద్దు. రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలతో పంటనష్టం జరిగింది. కామారెడ్డిలో అత్యధికంగా నష్టపోయారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి". - చిన్నారెడ్డి, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు

కాంగ్రెస్‌తో కరవు వచ్చిందని విపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పదేళ్లపాటు బీఆర్ఎస్‌ సర్కార్‌ చేసిన పాపాలే ఇప్పుడు కరవు రూపంలో వెంటాడుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పంట నష్టం పై అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు.

అకాలవర్షాలతో నిజామాబాద్‌ జిల్లాల్లో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు కోరారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఈ మేరకు విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కోనుగోలు ప్రారంభించి మద్దతు ధర కల్పించి రైతులను అదుకోవాలని కోరారు.

నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది : మంత్రి తుమ్మల

వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల సాయం అందించాలి : బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.