ETV Bharat / state

లోన్​యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లు భరించలేక రేషన్ డీలర్ ఆత్మహత్య - BHUPALPALLY RATION DEALER SUICIDE

Ration Dealer Suicide in Bhupalpally : లోన్​యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయి. ఈజీ మనీ అంటూ ప్రకటనలు గుప్పిస్తూ, అధిక వడ్డీలు వసూలు చేస్తూ పీల్చి పిప్పిచేస్తున్నారు. లోన్​యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ రేషన్ డీలర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

Ration Dealer Committed Suicide
Ration Dealer Committed Suicide (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 5:09 PM IST

Ration Dealer Committed Suicide in Bhupalpally : రాష్ట్రంలో లోన్​యాప్ బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. తక్కువ వడ్డీ రేట్లకే లోన్లంటూ ప్రచారం చేస్తూ, ఏదైనా అత్యవసరం వచ్చి లోన్​యాప్​లో అప్పు తీసుకోగా దానిపై ఎడాపెడా వడ్డీ జమ చేస్తూ తలకు మించిన భారంగా మారుస్తున్నారు. సకాలంలో చెల్లించకపోవడంతో వేధింపులకు గురిచేస్తూ, బ్లాక్ మెయిల్​కు పాల్పడుతూ యమదూతలుగా మారుతున్నారు. ఇటువంటి ఘటనలు అనునిత్యం వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఆన్​లైన్ లోన్​ యాప్​లో తీసుకున్న అప్పునకు ఈఎంఐలు చెల్లించలేక, లోన్​యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లను తట్టుకోలేక దివ్యాంగుడైన ఓ రేషన్ డీలర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్‌ నిర్వాహకుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

లోన్​ యాప్​ వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : జిల్లాలోని చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన గొడిశాల పైడయ్య (40) అనే వ్యక్తి ఆన్​లైన్ యాప్​ల ద్వారా రుణాలు తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులు బాగులేక ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన యాప్​ల నిర్వాహకుల ఒత్తిళ్లు తీవ్రంగా పెరిగాయి. దీంతో తీవ్రంగా మనస్థాపం చెంది రేషన్ షాప్​లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెడయ్య ఎంతకీ ఇంటికి రాకపోవడంతో షాపు వద్దకు వెళ్లి తల్లి చూసింది. రేషన్ షాపులోనే ఫ్యాన్​కు వేలాడుతూ కొడుకు కనిపించడంతో కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వచ్చి కిందికి దింపగా అప్పటికే పైడయ్య మృతి చెందినట్లు గుర్తించారు. లోన్​ యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, అతడి జేబులో సూసైడ్ నోట్ లభ్యమైంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.

అత్యవసరాల్లో లోన్‌ యాప్స్‌లో అప్పు తీసుకుని వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ఎస్ఐ శ్రావణ్ కుమార్ అన్నారు. రుణ యాప్ నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేసినప్పుడే తమకు ఫిర్యాదు చేయాలని, దానివల్ల వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేకానీ క్షణికావేశంలో, మనస్తాపానికి గురై ఇలా ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.

Online Loan App Fraud Gang Arrest In Hyderabad : ఆన్​లైన్​ రుణయాప్​ల కేసులో ఐదుగురు అరెస్టు.. కీలక సమాచారం స్వాధీనం

ఆగని లోన్​యాప్ నిర్వాహకుల వేధింపులు.. మరో వ్యక్తి బలి.. ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.