ETV Bharat / state

పిల్లల స్నాక్స్​ విభాగంలో ఎలుక - డీమార్ట్​లో కలకలం - Rat Died in Ramachandrapuram DMart - RAT DIED IN RAMACHANDRAPURAM DMART

Rat Died in Ramachandrapuram D Mart : సరసమైన ధరలలో కావాల్సిన వస్తువులన్ని ఒకచోట కొనగలిగే ప్రదేశంగా పేరుపొందిన డీమార్ట్​లోని పిల్లల స్నాక్స్ విభాగంలో ఎలుక కళేబరం కలకలం రేపింది. పిల్లలు తినే తినుబండారాలు దగ్గర మృతి చెందిన ఎలుకను చూసి వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో జరిగింది.

Rat Died in DMart Video
Rat Died in Ramachandrapuram DMart
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 6:38 PM IST

పిల్లల స్నాక్స్​ విభాగంలో ఎలుక మృతి డీమార్ట్​ సిబ్బందిపై ఫైర్ అయిన కస్టమర్స్​

Rat Died in Ramachandrapuram DMart : ప్రస్తుత రోజుల్లో నగరాల్లోనే కాకుండా కూడా పట్టణాల్లోనూ నాణ్యమైన సరుకులు సరసమైన ధరల్లో కొనాలనుకుంటే ప్రజలు చూపు డీ మార్ట్​ వైపే వెళ్తోంది. గ్రామస్తులు ఊర్లో కిరాణా దుకాణాల్లో అన్ని వస్తువులు లభించినా నగరానికి వచ్చినప్పుడు తమకు కావాల్సిన సరుకులను డీ మార్ట్(D MART)​లో కొని ఇంటికి తీసుకు వెళ్తుంటారు. అంతగా వ్యాపించింది. మరి ఇలాంటి వాణిజ్య సంస్థలో పిల్లలు తినే తినుబండారాలు ఉండే ప్రదేశంలో ఎలుక మృతి చెంది ఉండడం వినియోగదారులను కలవరపెడుతోంది. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో జరిగింది.

కిలోకి 300గ్రాములు ఫసక్.. డీమార్ట్​లో మోసం!

Custmors Complaint on D Mart Staff : వినియోగదారులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని డీ మార్ట్​లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ వినియోగదారుడు పిల్లలు తినే స్నాక్స్ విభాగం​ దగ్గరకు వచ్చినప్పుడు దుర్వాసన రావడం గమనించాడు. దీంతో ఆ తినుబండారాలను ఒక్కొక్కటిగా పక్కన తీస్తే వాటి మధ్య మృతి చెందిన ఎలుక కనిపించింది. అది చూసిన వినియోగదారుడు కాసేపు షాక్​ అయ్యాడు. అనంతరం దగ్గరల్లో ఉన్న సిబ్బందిని పిలిచి నిర్లక్ష్యం ఎందుకని వాగ్వాదానికి దిగాడు.

డీమార్ట్​లో కుళ్లిన ఖర్జూరాలు.. సీజ్​ చేసిన అధికారులు

Custmors Complaint on Ramachandrapuram DMart : తినే స్నాక్స్​ విభాగంలో చనిపోయిన ఎలుక ఉండడం చూసి మిగిలిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాహకులను, సిబ్బందిని నిలదీశారు. నిత్యవసర సరుకులు కొనేందుకు ఎక్కువ మంది వస్తారని అలాంటి ప్రదేశంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. దీంతో డీ మార్ట్​ సిబ్బంది స్పందించి తప్పు జరిగిందని, చూసుకోలేదని బదులిచ్చారు. మెల్లగా ఈ సమస్యను దాటవేసేందుకు ప్రయత్నించారు.

ఈ విషయాన్ని బయట ఎవ్వరికి చెప్పవద్దని వినియోగదారులను ప్రాధేయపడ్డారు. ఇకపై ఇలాంటి పొరపాటు జరగదని, జాగ్రత్తపడతామని తెలిపారు. అయితే వినియోగదారులు మాత్రం డీమార్ట్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్థాల స్టోరేజ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు ఈ విషయంపై విచారించి ఉత్పత్తుల నాణ్యత పరిశీలించాలని డిమాండ్​ చేస్తున్నారు. సదురు డీ మార్ట్​ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినందకు తగిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

మూడో త్రైమాసికంలో డీమార్ట్​కు లాభాల పంట

డీమార్ట్​లో క్యారీ బ్యాగ్స్​ కొంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.