ETV Bharat / state

బాలుడిపై అత్యాచారం కేసు - 20 ఏళ్ల జైలు శిక్ష - BOY RAPE CASE ACCUSED 20 YEARS JAIL

బాలుడిపై అత్యాచారానికి పాల్పడిని నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష - బాలికపై బలాత్కారం ఘటనలో మరో వ్యక్తికి పదేళ్లు

Boy_Rape_Case
Boy Rape Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2024, 2:32 PM IST

Boy Rape Case Accused 20 Years Jail: తెలంగాణ రాష్ట్రం జగిత్యాల బాలుడిపై అత్యాచారానికి పాల్పడిని నిందితుడికి జగిత్యాల న్యాయస్థానం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం మల్లాపూర్‌ మండలంలో 2019 ఏప్రిల్‌ 4వ తేదీన గోగుల సాయికుమార్‌ అనే వ్యక్తి ఓ బాలుడిని మామిడికాయలు తెచ్చుకుందామని చెప్పి గ్రామశివారులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. కేసు విచారణలో సాక్షులు, సైంటిఫిక్ ఎవిడెన్స్​లను సేకరించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.నీలిమ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధించారు. నిందితుడికి శిక్ష పడడానికి చొరవ చూపిన అధికారులను ఎస్పీ అభినందించారు.

భార్యపై 72 మంది అత్యాచారం- మాజీ భర్తకు 20 ఏళ్ల జైలుశిక్ష

బాలికపై బలాత్కారం ఘటనలో పది సంవత్సరాలు: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డి.వెంకటేష్‌ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన కుంచం రవి 2021 సెప్టెంబరు 20వ తేదీన బాలికకు ఫోన్‌ చేసి ప్రేమిస్తున్నానని, తనను కలిసేందుకు గుడి వద్దకు రావాలంటూ కోరాడు.

బీరు తాగి బాలికపై అత్యాచారం: అతని మాటలు నమ్మిన ఆ బాలిక గుడికి వెళ్లింది. అక్కడి నుంచి ఆమెను వేరే ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ భోజనం చేసిన తర్వాత తన గదికి తీసుకెళ్లాడు. గదిలో ఎవరూ లేకపోవడంతో తన వెంట తెచ్చుకున్న బీరు తాగి, తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ అనంతరం ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డి.వెంకటేష్‌ నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

మైనర్‌ బాలికపై అత్యాచారం - సవతి తండ్రికి 141 ఏళ్ల జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.