ETV Bharat / state

క్విట్‌ ఇండియా ఉద్యమం - చరిత్రకెక్కిన తెనాలి - RANARANGA CHOWK IN TENALI - RANARANGA CHOWK IN TENALI

Ranaranga Chowk in Tenali Symbolic for Quit India Martyrs : స్వాతంత్య్ర పోరాటం ఎన్ని తరాలైనా చెరిగిపోని చరిత్ర అది. ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. అంతటి గొప్ప చరిత్రలో గుంటూరు జిల్లా తెనాలికి కూడా కొన్ని పేజీలున్నాయి. క్విట్‌ ఇండియా ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో ఇక్కడ జరిగిన పోలీసుల కాల్పుల్లో ఏడుగురు అసువులు బాశారు. ఆ మహనీయుల బలిదానాల గుర్తుగా తెనాలిలో ప్రత్యేక స్థూపాలు ఏర్పాటు చేశారు. ఏటా ఆగస్టు 12న సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భరతమాత ఒడిలో ఒదిగిన ఆ ఏడుగురు ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుంటూ ఈటీవీ ప్రత్యేక కథనం.

ranaranga_chowk_in_tenali_symbolic_for_quit_india_martyrs
ranaranga_chowk_in_tenali_symbolic_for_quit_india_martyrs (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 11:02 AM IST

Updated : Aug 12, 2024, 11:31 AM IST

క్విట్‌ ఇండియాలో తెనాలి ఉద్యమకారుల పోరాట స్పూర్తి (ETV Bharat)

Ranaranga Chowk in Tenali Symbolic for Quit India Martyrs : దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో క్విట్‌ ఇండియా ఉద్యమం అత్యంత ప్రముఖమైనది. 1942 ఆగస్టు 8న బొంబాయిలో జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ 'డూ ఆర్‌ డై' అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ని నిషేధించి అగ్రశ్రేణి నాయకులందిరినీ నిర్బంధించింది. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి.

క్వీట్‌ ఇండియా తీర్మానంలో పాల్గొన్న తెనాలికి చెందిన కల్లూరి చంద్రమౌళి స్థానికులతో సమావేశమై ఆగస్టు 12న బంద్ చేపట్టారు. తెనాలి టౌన్‌ హైస్కూల్‌ నుంచి రైల్వేస్టేషన్‌ వరకూ ర్యాలీ చేశారు. రైల్వేస్టేషన్‌ని పూర్తిగా తగులబెట్టిన ఉద్యమకారులు తాలుకా కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసు బలగాలు, ఆందోళనకారులు ఎదురు పడ్డారు. వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ఉద్యమకారులు దూసుకెళ్లారు. పోలీసులు 21 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు ఉద్యమకారులు అమరులవగా, మరెందరో గాయపడ్డారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన చంద్రమౌళితో పాటు అనేక మందిని అరెస్టు చేశారు. ప్రత్యేక న్యాయస్థానం వీరికి రెండేళ్లు జైలు శిక్ష విధించింది.

'చరిత్ర వింటే ఒళ్లు గగుర్లు పుడుతుంది. ఒకింత ఉత్తేజం పెరుగుతుంది. తెనాలిలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమం దేశ వ్యాప్తంగా స్పూర్తినిచ్చింది. ఈ విషయం ఇక్కడ యువతకు తెలియాలి. దీనివల్ల వారిలో దేశ భక్తి పెరుగుతుంది. భరతమాతకు స్వేచ్ఛావాయులు అందించేందుకు తెనాలి కాల్పుల్లో మాజేటి సుబ్బారావు, శిరిగి లింగయ్య, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య, భాస్కరుని లక్ష్మీనారాయణ మరణించారు. వీటిని కళ్లకు కట్టేలా ధర్నాచౌక్​ను ఎప్పటికప్పుడు పునరుద్దరించేలా చర్యలు చేపడుతున్నాం.' - స్థానికులు

భరతమాతకు స్వేచ్ఛావాయులు అందించేందుకు తెనాలి కాల్పుల్లో మాజేటి సుబ్బారావు, శిరిగి లింగయ్య, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య, భాస్కరుని లక్ష్మీనారాయణ మరణించారు. ఆ మహనీయుల త్యాగాలకు గుర్తుగా కాల్పులు జరిగిన ప్రదేశంలో 1959లో అప్పటి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఆలపాటి వెంకట్రామయ్య ఆధ్వర్యంలో స్మారకం నిర్మించారు. దానికి రణరంగ చౌక్‌గా నామకరణం చేశారు. ఏడుగురు అమరవీరులకు గుర్తుగా ఏడు స్తంభాలు, వాటికి ముందువైపు భరతమాత ఒడిలో అసువులు బాసిన అమరవీరుని విగ్రహం ఉంటుంది. తర్వాతి కాలంలో పిచ్చిమొక్కలు పెరిగి చారిత్రక కట్టడం ప్రాభవం కోల్పోయింది.

గాంధీ-150: మహిళాభివృద్ధికి మహాత్ముడే తొలి సారథి

ఈ నేపథ్యంలో 2015లో అప్పటి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ రంణరంగ చౌక్‌ని ఆధునీకరించారు. 2015 ఆగస్టు 12న అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సమక్షంలో క్విట్‌ ఇండియా వేడుకలు నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా ఆగస్టు 12న అమరవీరుల్ని స్మరిస్తూ మున్సిపాలిటీ తరఫున అధికారిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయిస్తూ. కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, విశ్రాంత సైనికులను పిలిచి సన్మానించడంతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ప్రశంసా పత్రాలు అందిస్తున్నారు. 2007 నవంబర్‌ 1న విశాఖలో జరిగిన తపాలా బిళ్లల ప్రదర్శనలో భారతీయ తపాలా శాఖ రణరంగ చౌక్‌పై ప్రత్యేక పోస్టల్‌ కవరును విడుదల చేసింది.

Mahatma Gandhi: మహాత్ముడు మెచ్చిన రాజమండ్రి 'రత్నం'

Last Updated : Aug 12, 2024, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.