Ramoji Rao Samsmarana Sabha in Hyderabad : అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కలం యోధుడు రామోజీరావు అని ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు కొనియాడారు. హైదరాబాద్లోని కొండాపూర్ బొటానికల్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఈనాడు మాజీ ఉద్యోగులు, జర్నలిస్టులు , కవులు, రచయితలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
పెదపారుపూడికి రామోజీరావే పెద్ద దిక్కు - సంస్మరణ సభకు పెద్దఎత్తున హాజరైన గ్రామస్థులు
బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ తరపున రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న వక్తలు రామోజీరావు సేవలను కొనియాడారు. వ్యక్తిగా రామోజీరావు జీవిత ప్రయాణం అందరికీ ఆదర్శమని పద్య కవయిత్రి కుసుమ పేర్కొన్నారు. ఈనాడు సంస్థలను స్థాపించి ఎంతో మందికి జీవితాన్నిచిన మహానీయ వ్యక్తి అని కీర్తించారు. రాజధాని ఫైల్స్ సినిమా తీసినప్పుడు చాలా ధైర్యం చేశావని అని తనను మెచ్చుకున్నారని రాజధాని ఫైల్స్ ప్రొడ్యూసర్ కె. రవిశంకర్ పేర్కొన్నారు. ఆయన చూసిన చివరి సినిమా రాజధాని ఫైల్స్ అని వెల్లడించారు. జర్నలిస్టు విలువలంటే ఈనాడుదే అని కీర్తించారు. తెలుగు జాతికి ఆయన చిరస్మరణీయుడని వెల్లడించారు.
రామోజీరావు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి అని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. రామోజీ అంటేనే ఒక బ్రాండ్, ఏ వ్యాపారం చేసినా ప్రజాహితం కోసం చేసేవారని గుర్తుచేశారు. ప్రింట్ కనుమరుగయ్యే అయ్యే రోజుల్లో, ఈనాడు ఇప్పటికీ తన హవాకొనసాగిస్తుందని అన్నారు. ఆయన చేసిన గొప్ప పనులు, ప్రజాహితమైన పనుల వల్లే నేడు ఎంతో మంది ఆయణ్ను స్మరించుకుంటున్నారని తెలిపారు. ఆయన మరణం ఊహించని పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పక్షమే ఈనాడు ధ్యేయం అని చెప్పిన గొప్ప వ్యక్తి రామోజీ రావు అని డిఎన్ ప్రసాద్ కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా రామోజీరావు సంస్మరణ సభ - హాజరైన అతిరథ మహారథులు
నీతి నిజాయితీ ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదని చాటి చెప్పిన వ్యక్తి రామోజీరావు. చిన్న ఫాల్ట్ కూడా లేకుండా మార్గదర్శిని నడుపుతున్నారు. ప్రభుత్వాలు ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా, కేవలం నిజాయితీతోనే నిలబడగలిగారు. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న ఇవ్వాలి. తన సమాధిని తానే నిర్మించుకున్న గొప్ప వ్యక్తి రామోజీ రావు. - సినీ నటుడు మురళీమోహన్
ప్రభుత్వం ఏదైనా రామోజీరావు ప్రజా పక్షమే అని ఎంఎల్ఏ రఘు రామ కృష్ణం రాజు తెలిపారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. గత ప్రభుత్వం ఆయనను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూసిందన్నారు. అయినా ఆయన వారికి దీటుగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ఏపీలో ప్రభుత్వం మారడానికి భస్మాసురుడి లాంటి జగన్ ఓటమికి, శ్రీకృష్ణుని లాంటి రామోజీరావే కారణమని ఆయన అన్నారు.
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి: సీఎం చంద్రబాబు - CM Chandrababu on Ramoji Rao