Lavanya Throws Cheppal At Shekar Basha in a Live Show: సినీనటుడు రాజ్‌తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్‌తరుణ్ స్నేహితుడైన ఆర్‌జే శేఖర్ బాషా తనపై దాడికి పాల్పడ్డాడంటూ లావణ్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆమే తనపై దాడికి ప్రయత్నించిందని శేఖర్ బాషా సైతం అదే పోలీస్ స్టేషన్‌లో ప్రతిఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్‌లో లావణ్య, శేఖర్ బాషా చర్చా కార్యక్రమానికి వెళ్లగా, అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తనపై శేఖర్ బాషా దాడికి పాల్పడ్డారని లావణ్య, లేదు ఆమే తనపట్ల అమానుషంగా ప్రవర్తించిందని శేఖర్ బాషా పరస్పరం ఫిర్యాదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.
లావణ్యవి ఆరోపణలే - నా దగ్గర ఆధారాలున్నాయి: హీరో రాజ్ తరుణ్ - Hero Raj Tarun Reaction on lavanya
'పురుషోత్తముడు' రాజ్ తరుణ్‌కు కొత్త ట్యాగ్ - ఇకపై అలానే పిలవాలట