Rains in Telangana from Tomorrow : గత కొన్నిరోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఆదివారం నుంచి రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఈనెల మూడో తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గి వాతావరణం చల్లబడుతుందని ప్రకటించింది. మే 30న రుతుపవనాలు కేరళను తాకాయని జూన్ 5, 6 తేదీల్లో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
గత రెండు రోజులుగా 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. శనివారం కూడా ఆదిలాబాద్, మంచిర్యాలలో 45 డిగ్రీలు కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంది. శనివారం కొన్ని జిల్లాల్లో సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆరోగ్యంపై వాతావరణ మార్పుల పంజా - కట్టడికి చర్యలు చేపట్టిన కేంద్రం - Climate Change Impact On Health