Heavy Rain Again in Telangana : ఏపీలో నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ కుండపోత వర్షం కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను వర్షం ముంచెత్తింది. వర్షంతో పలుచోట్ల కాలనీలు నీట మునగగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏపీలో నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ కుండపోత వర్షం కురిసింది.
ఈదురు గాలులతో కూడిన వర్షం : వర్షంతో పలుచోట్ల కాలనీలు నీట మునగగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో కరీంనగర్‌లో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలకు ఉపశమనం లభించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పిడుగుపడి ఎద్దు మృతి : ఈదురు గాలులకు పలుచోట్ల మామిడికాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రక్షించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోవడంతో నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. హనుమకొండ, కాజీపేటలో ఈదురు గాలులతో వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జైదుపల్లి గ్రామంలో పిడుగుపడి లోట్ల రాములు అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది.
Heavy Rains In Kumuram Bheem Asifabad District : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి 5 కి.మీ దూరంలో ఉన్న గుండి వాగుపై మట్టితో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక వంతెన నీటి ప్రవాహంలో కొట్టుకుని పోవడంతో ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని పలు గ్రామాల్లో స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు మామిడికాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రక్షించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు.
జలమయమైన రోడ్లు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధాన రహదారులు, చెరువులను తలపించాయి. ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న దుకాణ సముదాయాలలో వర్షపు నీరు చేరింది. కొద్ది రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్క పోతకు గురైన ప్రజలకు ఉపశమనం లభించింది.
గాలివాన బీభత్సం : బెజ్జూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గాలివానకు ఇంటి పైకప్పులు ఎగిసిపడగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలువురి ఇంటి రేకులు ఎగిరిపోవడంతో వర్షపు నీరు ఇంట్లో చేరి నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. ఎలుకపల్లిలో మేకపై రేకులు పడగా అది అక్కడే మృతి చెందింది. చెట్టు విరిగి ఎద్దుపై పడడంతో గాయాల పాలయింది.
వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు : వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వరంగల్, హనుమకొండల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ములుగు జిల్లాలో ములుగు, గోవిందరావుపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లోనూ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులు భారీ వర్షం ధాటికి పలు చోట్ల విద‌్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. భానుడి ప్రతాపంతో ఇన్నాళ్లూ అల్లాడిన ప్రజలు భారీ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు - మరో ఐదురోజులు ఇదే పరిస్థితి - Heavy Rains In Telangana
అలర్ట్ - అలర్ట్ - నడివేసవిలో వర్షబీభత్సం - నేలరాలిన పంటలు - కొట్టుకుపోయిన ధాన్యరాశులు - SUDDEN RAINS IN TELANGANA