Rain in Hyderabad : ఉదయం నుంచి సూర్యుని ప్రతాపంతో ఉక్కబోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులను సాయంత్రం పడిన వర్షం కాస్త ఉపశమనం కల్పించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారడంతో వర్షం పడింది. హైదరాబాద్‌లోని పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
అలాగే హైదరాబాద్ పరిధిలోని సుచిత్ర, కొంపల్లి, గుండ్ల పోచంపల్లిలో ఒక్కసారిగా వర్షం కురిసింది. మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, గాజిల్లాపూర్, సైదాబాద్, చంపాపేట్, సరూర్‌నగర్, కర్మఘాట్, సికింద్రాబాద్, బోయినపల్లి, అల్వాల్, తిరుమల గిరి, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో వర్షం పడింది.
పలు ప్రాంతాల్లో వర్షం : తార్నాక్, ఓయూ క్యాంపస్, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, మధురానగర్, బోరబండ, ఈఎస్ఐ, సనత్‌నగర్, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచింది. హబ్సిగుడా చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఉద్యోగం ముగించుకొని ఇంటికి బయలు దేరిన ఉద్యోగులు,విద్యార్థులు వర్షానికి తడిచిపోయారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం - రోడ్లపై పారుతున్న వరద నీరు - Heavy Rain in Hyderabad