Heavy Rains in Uttarandra District : వర్షాలకు ఉత్తరాంధ్రలోని ఏజన్సీ గ్రామాల్లో రవాణా అస్తవ్యస్థమైంది. గెడ్డలు పొంగి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో పర్యటించి పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జి : వర్షాలు తగ్గినా ఉత్తరాంధ్రలోని గెడ్డలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. అల్లూరి జిల్లా ముంచంగిపుట్ మండలం లక్ష్మీపురం పంచాయతీలో ముంతగుమ్మి వంతెన కొట్టుకుపోయి 30గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. నీటి ఉద్ధృతికి పాత బిడ్జి కొట్టుకోపోయింది. చింతపల్లి, జీకే విధి మండలాల్లో కొట్టుకుపోయిన వంతెనలు, కల్వర్టులు, మునిగిన వరి పొలాలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు. ఏజెన్సీలో చాలాచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. జీకే వీధి- దారకొండ మధ్య తెగిన విద్యుత్ వైర్లను మంత్రి సంధ్యారాణి ఆదేశాలతో లైన్‌మెన్లు సరిచేస్తున్నారు.
బాధితుల్ని పరామర్శించిన హోంమంత్రి : పులికాట్ వాగు పొంగి అనకాపల్లి జిల్లా శంకరం గ్రామంలో పొలాల్ని ముంచెత్తింది. దాదాపు 20 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ప్రధానంగా వరి, కొబ్బరి పంటలు నాశనం అయ్యాయి. అనకాపల్లిజిల్లా పాయకరావుపేట నియోజవర్గం ఎస్ రాయవరం వద్ద వాగు ఉద్ధృతికి రోడ్డు కోతకు గురైంది. తాండవ నదికి అనుకుని ఉన్న చాకలిపేట ఇంకా ముంపు లోనే ఉంది. హోంమంత్రి అనిత బాధితుల్ని పరామర్శించారు. దెబ్బతిన్నరోడ్లకు తక్షణం మరమ్మతులు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి - జలాశయాలకు పోటెత్తుతున్న వరద - HEAVY RAINS IN UTTARANDRA
నీటిపారుదల శాఖ అధికారిపై మంత్రి ఆగ్రహం : విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు, కల్వర్టును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధికారులు ముందే అప్రమత్తం చేయలేదని రైతులు ఫిర్యాదు చేయగా నీటిపారుదల శాఖ అధికారి రూపాపై మంత్రి ఆగ్రహం వెలిబుచ్చారు. వంశధార, మహేంద్రతనయ నదుల్లో వరద పెరుగుతోంది. ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు పాతపట్నం నియోజకవర్గం జిల్లేడుపేట గ్రామానికి నాటు పడవపై వెళ్తున్న హిరమండలం తహసిల్దార్, ఎంఈఓ మధ్యలో చిక్కుకుపోయారు. గ్రామస్థులు వారిని సురక్షింతంగా ఒడ్డుకు చేర్చారు.
ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి- ఎడతెరిపిలేని వర్షాలతో ప్రమాదకరంగా వాగులు - Heavy rains in Uttarandhra