NEET Exam In Two Phases : జేఈఈ తరహాలోనే నీట్‌ను రెండంచెల్లో నిర్వహించాలని రాధాకృష్ణన్ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. గత నీట్ సందర్భంగా కొందరు విద్యార్థులకు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇచ్చినందుకు వారికి మార్కులు కేటాయించిన విధానం వివాదాస్పదం కావడంతో పాటు ప్రశ్నపత్రాలు లీకైనట్లు ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో సమర్థంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన సూచనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత జులైలో ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ అధ్యక్షతన నిపుణల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటీవల కేంద్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. నీట్, సీయూఈటీల నిర్వహణలో తీసుకురావాల్సిన మార్పులను కమటీ సూచించింది.
జేఈఈ మాదిరి : విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో సీట్ల భర్తీకి తొలుత జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అందులో కనీస మార్కులు సాధించిన వారికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతిస్తున్నారు. నీట్‌కు దేశవ్యాప్తంగా 18 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నందువల్ల తొలుత వడపోత కోసం ముందుగా ఒక పరీక్ష నిర్వహించి, అందులో కనీస మార్కులు సాధించిన వారికి మరో పరీక్ష పెట్టాలని కమిటీ సిఫారసు చేసింది. దానివల్ల తుది పరీక్షకు విద్యార్థులు, పరీక్ష కేంద్రాల సంఖ్య తగ్గుతుంది. దీంతో పర్యవేక్షణ పెరిగి పరీక్ష నిర్వహణ సులువు అవుతుంది. తొలి పరీక్షను ఆన్‌లైన్‌లో, తుది పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో జరపొచ్చు. కొన్ని ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించవచ్చు. ఎక్కడ ఎలా వీలుంటే అలా పరీక్ష నిర్వహించవచ్చు.
అవన్నీ పక్కనబెట్టి - అనుకున్నది సాధించాడు! - ఈ నాన్న నిజంగానే రియల్ హీరో!!
ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహించాలి అంటే ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాలను పంపాల్సి ఉంటుంది. ఆ సమయంలో లీకేజీకి అవకాశం ఉంటుంది. కాబట్టి పరీక్ష ప్రారంభమయ్యేందుకు అరగంట లేదా గంట ముందు డిజిటల్ రూపంలో ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం పంపొచ్చు. వాటిని ప్రింట్లు తీసి అప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు ఇవ్వాలి. ఇక దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే సీయూఈటీల్లో ప్రస్తుతం 50 సబ్జెక్టులు ఉన్నాయి. వాటిని తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్‌టీఏలో అత్యధిక సిబ్బంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. పరీక్షల నిర్వహణ, డేటా భద్రత కోసం నిపుణులైన శాశ్వత ఉద్యోగులను నియమించుకుంటే మేలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. కమిటీ తుది నివేదికను కొద్దిరోజుల్లో సమర్పించనుంది. కొన్ని సిఫారనులను వచ్చే నీట్‌లోనే అమలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జేఈఈ, నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? - మీ కోసమే ఫ్రీ కోచింగ్ - ఎక్కడంటే?3
నీట్ పేపర్ లీకేజ్ - క్వశ్చన్ పేపర్ కోసం 144 మంది డబ్బులిచ్చారు : సీబీఐ