ETV Bharat / state

మిరపతోటలో చిరుత - మరో జిల్లాలో చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్న మేకల కాపరి - LEOPARD IN FIELDS

జనావాసాల్లోకి చిరుతపులులు - రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సంచారం - నిర్మల్ జిల్లాలో మేకల కాపరిని వెంటాడిన చిరుత - ఖమ్మం జిల్లాలో మిరపతోటలో విహారం

public_in_panic_due_to_leopard_wandering_in_telangana
public_in_panic_due_to_leopard_wandering_in_telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2024, 12:39 PM IST

Updated : Oct 25, 2024, 1:10 PM IST

Public in Panic Due to Leopard Wandering in Telangana : వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొందరు సంపాదన కోసం అక్రమంగా విరివిగా అడవులను నరికి, కొండలను కూల్చేస్తుండటంతో వాటికి ఆవాసాలు లేక అడవిలో ఉండాల్సిన జీవాలు జనావాసాల్లో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవి ప్రజలు, పశువులపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరుత, పెద్దపులి, ఎలుగుబంటి సంచారం, దాడులు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలే తెలంగాణలోని నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.

Leopard Hulchul in Nirmal District : నిర్మల్‌ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సారంగపూర్‌ మండలం రవీంద్రనగర్‌ సమీపంలో సహ్యాద్రి కొండల వద్ద ఓ వ్యక్తి మేకలను కాసేందుకు వెళ్లాడు. మేకలు మేత మేస్తుండగా అతడు ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ చిరుత అతని వైపు వస్తుండడాన్ని గమనించి మేకల కాపరి కేకలు వేస్తూ వెంటనే చెట్టెక్కాడు. అతడు బిగ్గరగా కేకలు వేయడంతో చిరుతపులి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయింది. అయితే, అంతకంటే ముందే ఆ క్రూరమృగం రెండు మేకలను చంపింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Leopard Wanders in Khammam District : మరోవైపు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడ సమీపంలోని మిరప తోటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. మిరప తోటలో చిరుత సంచరిస్తుండగా చూసిన అక్కడ పనిచేసే యువకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తల్లాడ రేంజ్ అధికారి శ్రీనివాస రావు తమ సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.

"పత్తిచేనులో పెద్దపులి" - తాళ్లు తెంపుకుని ఊళ్లోకి పరిగెత్తిన ఎద్దులు

పాదముద్రలను పరిశీలించిన అటవీ అధికారులు అది చిరుత పిల్ల అని నిర్ధారించారు. అనంతరం గ్రామస్థులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని రేపల్లెవాడ గ్రామంలో మైకు ద్వారా హెచ్చరించారు. ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చడం లాంటి పనులు చేయవద్దని తెలిపారు. ఎక్కడికైనా వెళ్లాలంటే గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు చిరుత పులి పిల్లను వీలైనంత తొందరగా పట్టుకుంటామని తెలిపారు. అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

గౌతమి మధ్యలంక ప్రాంతాల్లో చిరుత అలజడి! - డ్రోన్లతో గాలింపు చేపట్టిన అటవీ శాఖ - Leopard movement in East Godavari

Last Updated : Oct 25, 2024, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.