ETV Bharat / state

ప్రైవేట్​ ట్రావెల్స్​ దసరా దందా ! రద్దీకి అనుగుణంగా చార్జీల రెట్టింపు

ఆర్టీసీ బస్సుల్లో సీట్లు పరిమితం - బాదుడే బాదుడు అంటున్న ప్రైవేట్​ ట్రావెల్స్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

PRIVATE_TRAVELS_DOUBLING_FARES
PRIVATE_TRAVELS_DOUBLING_FARES (ETV Bharat)

Private Travels Doubling Fares on Festival Season in AP : దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమైన వారిని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ నిలువు దోపిడీ చేస్తున్నాయి. సాధారణ ఛార్జీలను ఒక్కసారిగా పెంచేశాయి. రద్దీ ఎక్కువగా ఉందని, అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయని, కొన్ని సీట్లే మిగిలాయంటూ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రైలులో బెర్తులు ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించవలసిన పరిస్థితి నెలకొంది.

దసరా పండుగ శనివారం రావడం, ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు గురు, శుక్రవారాల్లోనే సొంత గూటికి పయనం అవుతున్నారు. ఈ 2 రోజులను టార్గెట్​ చేసుకొని ప్రైవేట్​ ట్రావెల్స్‌ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 1,200 వరకు ప్రైవేట్​ ట్రావెల్స్‌ బస్సులు ఉండగా, పేరున్న ప్రముఖ సంస్థలే బాదుడులో పోటీ పడుతున్నాయి. సాధారణ రోజుల కంటే ఈ 2 రోజుల్లో ఏసీ బస్సుల్లో సగటున ఒక్కో సీటుకు రూ.1000, నాన్‌ ఏసీ బస్సుల్లో రూ.700 వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

దసరా పండుగకు ఇంటికి వెళ్తున్నారా? - అయితే మీకో శుభవార్త - dasara Special Buses

విజయవాడ నుంచి విశాఖపట్నానికి పలు ప్రైవేటు ట్రావెల్స్‌ ఏసీ బస్సుల్లో ఒక్కో బెర్త్‌కు రూ.2000 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి కాకినాడకు రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు సొమ్ము చేసుకుంటున్నాయి. విజయవాడ నుంచి విశాఖకు ఆర్టీసీ ఏసీ ఇంద్ర సర్వీసులో సీటుకు రూ.905, అమరావతిలో రూ.1,120 కాగా, నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీలో రూ.704 మాత్రమే ఛార్జీ ధరలు ఉన్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌తో పోలిస్తే ఈ రేట్లు తక్కువే. కానీ అనేక బస్సుల్లో ఒకటి, రెండు సీట్లే ఖాళీ కనిపిస్తున్నాయి. దీంతో కుటుంబ సమేతంగా ఊళ్లకు వెళ్లేవారు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాల్లోని ముఖ్య నగరాలకు వెళ్లే ట్రావెల్స్​ ఛార్జీలు అధికంగా ఉన్నాయి.

దసరా వచ్చిందంటే దొంగలకు పండగే! - తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్ - HOME SAFETY MEASURES BY POLICE

తిరుగు ప్రయాణంలో రెండింతల వడ్డన : దసరా సెలవులు ఆదివారంతో (అక్టోబర్​ 12న) ముగుస్తాయి. అనేక విద్యాసంస్థలు, కళాశాలలు సోమవారమే (అక్టోబర్​ 13న) తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో సొంతూళ్ల నుంచి పట్టణాలకు తిరుగు ప్రయాణమయ్యే వారి అవసరాన్ని సొమ్ము చేసుకునేలా ఆదివారం సాయంత్రం నుంచి బయల్దేరే సర్వీసులకు అత్యంత డిమాండ్‌ సృష్టించారు. సాధారణ ఛార్జీల కంటే 2 రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు.

విశాఖపట్నం- విజయవాడ మధ్య పలు సర్వీసుల్లో ఏకంగా రూ.3 వేలకు పైగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్​ ట్రావెల్స్‌ సంస్థలు అమాంతం పెంచేసిన బస్సు ఛార్జీలను ఆన్‌లైన్‌లో దర్జాగా ప్రదర్శిస్తున్నా, రవాణా శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు అధిక ఛార్జీలతో రాకపోకలు సాగిస్తున్న ట్రావెల్స్‌పై తనిఖీలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

దసరా స్పెషల్​ - ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే - APSRTC DUSSEHRA SPECIAL BUSES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.