ETV Bharat / state

ఏపీలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ - ఎక్కడంటే... - Prime Minister Modi - PRIME MINISTER MODI

PM Narendra Modi AP tour: ప్రధాని మోదీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి బహిరంగ సభల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కడప లేదా రాజంపేట, మరోచోట సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు వెల్లడిచారు.

PM Modi AP tour
PM Modi AP tour
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 4:59 PM IST

Updated : Apr 18, 2024, 5:16 PM IST

PM Narendra Modi AP tour: ప్రధాని మోదీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి బహిరంగ సభల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కడప లేదా రాజంపేట, మరోచోట సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు వెల్లడిచారు.

బీజేపీ నేతల పర్యటన: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కూటమి ప్రచార వేగం మరింత పెంచింది. ఇప్పటికే ఆరు నియోజకవర్గాల్లో ప్రజాగళం - వారాహి విజయోత్సవ సభలు విజయవంతంగా నిర్వహించిన చంద్రబాబు - పవన్‌ కల్యాణ్ లకు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇతర బీజేపీ జాతీయ నేతలు జతకట్టనున్నారు. నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

'పేదల బాధలు పట్టని కాంగ్రెస్- మా వల్ల పదేళ్లలో 25కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి' - PM Modi slams congress

పాల్గొననున్న చంద్రబాబు, పవన్: అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేటల్లో ఒకటి, మరోచోట బహిరంగ సభల్లో ప్రధాని మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనేలా కూటమి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈలోగా చంద్రబాబు - పవన్ కల్యాణ్ వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ఈ నెల 24న రాయలసీమలో చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఉమ్మడిగా ప్రచారం చేపట్టనున్నారు.

ప్రజాగళం, వారాహీ విజయోత్సవ సభలు: రాజంపేట, రైల్వే కోడూరుల్లో ప్రజాగళం- వారాహీ విజయ యాత్ర సభల్లో ఇరువురు నేతలు పాల్గొననున్నారు. రేపు ఆలూరు, రాయదుర్గం నియోజలవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళ (Prajagalam )నిర్వహించనున్నారు. 20న గూడూరు, సర్వేపల్లి, సత్యవేడుల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈనెల 23న నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో చంద్రబాబు - పవన్ కల్యాణ్ ప్రజాగళం, వారాహీ ( Pawan varahi yatra ) విజయోత్సవ సభలు చేపట్టనున్నారు.

'బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తారా?'- క్లారిటీ ఇచ్చిన మోదీ - pm modi on indi alliance

Last Updated : Apr 18, 2024, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.