Prices of vegetables increased : ఎన్నడూ లేనంతగా నేడు కూరగాయల ధరలు మండుతున్నాయి. ధరలు పెరగడంతో సామాన్యులు ఏం తినాలన్నా ఆలోచించే పరిస్థితి తలెత్తుతుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు. పచ్చడి మెతుకులే గతి అని పేదలు గగ్గోలు పెడుతున్నారు. కూరగాయల దిగుబడి తక్కువ స్థాయిలో నమోదు కావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ధరలు ఆకాశాన్నంటాయని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"మన దగ్గర బేరాల్లేవమ్మా!" - భయపెడుతున్న రైతు బజార్ మార్కెట్ రేట్లు
ఒక్కో దుకాణం వద్దా ఒక్కోలా: కూరగాయల ధరలపై కార్తిక మాసం ప్రభావం ఒకటిగా చెప్పవచ్చు. చాలా మంది కార్తిక పూజలు, దీక్షలు చేపడుతుంటారు. ఈ సమయంలో శాఖాహారం మాత్రమే భుజించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇదే అదునుగా చూసుకుని వ్యాపారులు తగ్గిన దిగిబడిని తమకు అనుకూలంగా మలచుకుని ధరలను రెండితలు పెంచి డబ్బులు చేసుకుంటున్నారు. దీని ప్రకారం ఒక్కో దుకాణం వద్ద ఒక్కో రకమైన ధర ఉండటాన్ని గమనించవచ్చు.
రూ.500/-కు అయిదు రకాలు రావడం లేదు: కూరగాయల ధరలు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. వంకాయ, బెండకాయలను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ మధ్య టమాటా ధర కొంతమేర తగ్గినప్పటికీ మిగిలిన కూరగాయలు పెరిగాయి. 500 తీసుకెళ్తే అయిదు రకాల కూరగాయలు సైతం రాని పరిస్థితి. ఆకుకూరలు ఒక కట్ట 10 నుంచి 15 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు. దీంతో పేదవారు కూరలు తినే పరిస్థితి కనుపించటం లేదు. ఈ స్థాయి ధరల పెరుగుదలకు సరైన పంట దిగుబడి లేకపోవడం ఒక ప్రధాన అవరోధంగా పరిగణించవచ్చు. ధరలు విపరీతంగా పెరిగినా సరే కనీస అవసరాలు కాబట్టి కొనాల్సిన పరిస్థితి.
ప్రభుత్వాలు దీనిపై చర్యలు చేపట్టాలి: పెరుగుతోన్న ధరలను గమనించి ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు చేపట్టాలి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి ధరల స్థిరీకరణను అవలంబించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. దేశ వ్యాప్తంగా ఉన్న కూరగాయల సాగులో అవరోధాలను అధిగమించి రైతులందరికీ మేలు చేకూరే విధంగా వారికి తగిన ప్రోత్సాహకాలను అందించాలి. అప్పుడే ఈ ధరలను నియంత్రణలో ఉంచవచ్చు.
ట'మాటల్లేవ్' - సెంచరీ కొట్టిన రేటు - Tomato Price Hike in AP