ETV Bharat / state

బెంగుళూరు దుస్థితికి మనం దగ్గరలోనే ఉన్నామా? - water shortage in hyderabad

Water Crisis in Bangalore : ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరును తీవ్ర నీటికొరత వేధిస్తోంది. నగరంలో తీవ్రస్థాయిలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేఫథ్యంలో ఇటువంటి పరిస్థితి హైదరాబాద్‌కు తలెత్తకుండా ఉండాలంటే, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Precautionary to water Crisis in Hyderabad
Water Crisis in Bangalore
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 1:20 PM IST

Water Crisis in Bangalore : కర్ణాటక రాజధాని బెంగళూరులో(Bangalore) నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 60శాతం మంది ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నీటిని వృథా చేస్తే రూ.5000 జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలోనూ 2019లో అదే పరిస్థితి. చివరికి రైల్వే వ్యాగన్ల ద్వారా తాగునీటిని తరలించారు. ఈ మహానగరాలతో పోల్చితే హైదరాబాద్‌ శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటికే జనాభా కోటి దాటింది. 2050 నాటికి 2 కోట్లు దాటనుంది.

Precautionary to water Crisis in Hyderabad : ఈ నేపథ్యంలో అప్పటి అవసరాలకు తగ్గట్టు ప్రజలకు తాగునీటి సరఫరా పెను సవాలుగా మారనుంది. ఇప్పటినుంచే ప్రణాళికలతోపాటు నీటి వినియోగంలో వృథా తగ్గించి పొదుపు పాటించడం అవసరమని, రీసైక్లింగ్‌ విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సరఫరా చేస్తున్న నీటిలో 20శాతం వరకు లీకేజీలు, వాడకంలో వృథా అవుతోందని జలమండలి గతంలో లెక్క వేసింది.

1985లో తీవ్ర వర్షాభావం వల్ల తాగునీటికి నగరంలో కటకట ఏర్పడింది. విజయవాడ నుంచి 15 వ్యాగన్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. దీంతో పాలకులు తర్వాత కాలంలో సింగూరు రెండు, మూడు దశలు చేపట్టి అదనపు జలాలు తరలించారు. అనంతరం కృష్ణా నాలుగు దశలు, గోదావరి నుంచి నీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌(Nagarjuna sagar), ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా దాదాపు 160-180 కిలోమీటర్ల నుంచి నగరానికి నీటిని తీసుకొస్తున్నారు. ఇందుకోసం విద్యుత్తు ఛార్జీలకే నెలకు రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. ఇంత విలువైన నీటిలో చాలా వరకు వృథాగా పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

బెంగళూరులో నీటి కటకట-కార్ వాషింగ్, వాటర్ ఫౌంటెన్లపై ఆంక్షలు​!- నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5వేలు ఫైన్

గ్రేటర్‌ వ్యాప్తంగా రోజు విడిచి రోజు 2,547 మిలియన్‌ లీటర్ల నీటిని అందిస్తున్నారు. ఇందులో 20శాతం అంటే 509 మిలియన్‌ లీటర్ల వరకు వృథా అవుతున్నట్లు అంచనా. పాత పైపులైన్ల వ్యవస్థ, లీకేజీలు, సర్వీసు రిజర్వాయర్ల ఓవర్‌ ఫ్లో, ఇంటి ముందు రహదారులు పైపులు పెట్టి కడగటం, పబ్లిక్‌ నల్లాలకు ట్యాప్‌లు లేకపోవడం తదితర కారణాలతో ఎక్కువ వృథాగా పోతోంది.

మహానగరంలో నీటి సరఫరా ఇలా..

  • సర్వీసు ఏరియా 1451.91 చదరపు కిలోమీటర్లు (ఓఆర్‌ఆర్‌ వరకు)
  • మొత్తం పైపులైన్ల వ్యవస్థ 10 వేల కిలోమీటర్లు
  • శుద్ధి చేసిన నీటిని తరలించే పైపులు 1300 కిలోమీటర్లు
  • మొత్తం నల్లాలు 13 లక్షలు
  • రోజు విడిచి రోజు వ్యక్తికి ఇచ్చే నీళ్లు 150 లీటర్లు

ముగిసిన ఎన్డీఎస్​ఏ నిపుణుల కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన - ఇంజినీర్లపై కమిటీ ఛైర్మన్ ఫైర్

తెరుచుకున్న బాబ్లీ గేట్లు, తెలంగాణలోకి గోదావరి ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.